HomesportsRovman Powell: క్రికెటర్‌కి వార్నింగ్ ఇచ్చిన పీఈటీ... ఇంకోసారి ఇక్క‌డ క‌న‌ప‌డ్డావంటే..!

Rovman Powell: క్రికెటర్‌కి వార్నింగ్ ఇచ్చిన పీఈటీ… ఇంకోసారి ఇక్క‌డ క‌న‌ప‌డ్డావంటే..!

Telugu Flash News

Rovman Powell:  ఒక్కోసారి క్రికెట‌ర్స్‌కి సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తుంటాయి.వారికి సంబంధించిన విష‌యాలు తెలుసుకొని క్రికెట్ ప్రేమికులు ఆశ్చ‌ర్య‌పోతుంటారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మెరుపులు మెరిపించిన వెస్టిండీస్ క్రికెటర్ రొవ్మన్ పావెల్ గురించి ఓ విష‌యం నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాలు మార్చగల పావెల్ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నోకష్టాలు పడ్డాడు. తన అమ్మకు ఇచ్చిన మాట కోసం పావెల్ చిన్నతనంలోనే పడరాని అవ‌స్థ‌లు ప‌డ్డాడు. అయితే ఈ విండీస్ హిట్టర్ రొవ్మన్ పావెల్ క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోవడానికి ఓ ఆసక్తికర ఘటన జరిగింది.

పావెల్ కు ట్రాక్ అండ్ ఫీల్డ్ లో అథ్లెట్ గా గానీ లేదా మిలిటరీలో గానీ చేరదామని ఎంతో ఆస‌క్తి ఉండేదట. కానీ తన స్కూల్ లో ఉండే ఫిజికల్ ఎడ్యుకేషనల్ (పీఈ) టీచర్ కార్ల్టన్ సోలన్.. పావెల్ లైఫ్ ను మార్చేశాడ‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు పావెల్‌. నేను ఓసారి ట్రాక్ అండ్ ఫీల్డ్ ట్రైనింగ్ కు వెళ్లా. అక్కడ ఆయన కూడా ఉన్నాడు.. ‘నువ్వు ఇక్కడికెందుకు వచ్చావ్..? బహుశా నువ్వు ఇక్కడికి రావడం ఇదే చివరిసారి అనుకుంటా..’ అని అన‌డంతో నేను షాక్ అయ్యా. ఆ తర్వాత ఆయన నాతో.. ‘నువ్వు క్రికెట్ చాలా బాగా ఆడతావు. ఈ ట్రాక్ అండ్ ఫీల్డ్ ను వదిలేయ్. ఇది నీకు సెట్ అవదు. నా మాట వినకుండా నువ్వు మళ్లీ ఇక్కడ గనక కనబడితే నేను నిన్ను కొడతా..’ అంటూ హెచ్చ‌రించాడ‌ని పావెల్ అన్నాడు.

నువ్వు రెండింటి (క్రికెట్, ట్రాక్ అండ్ ఫీల్డ్) మీద దృష్టి సారిస్తానంటే కుదరదు. అలా చేస్తే దేనిమీద వంద శాతం కచ్చితంగా ఆడలేవు అని’ చెప్పాడని పావెల్ చెప్పుకొచ్చాడు. ఆయన సూచనతోనే పావెల్ క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నాడ‌ట‌. జమైకాలోని ఓల్డ్ హర్బర్‌లో జన్మించిన రోవ్‌మెన్ పావెల్‌కి తండ్రి లేడు. తల్లి, సోదరితో పెరిగిన పావెల్, చిన్నతనంలో కడుపునిండా తినడానికి కూడా ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని, అతను చాలా క‌ష్టాలు ప‌డి ఈ స్థాయినికి చేరుకున్నాడ‌ని బిష‌ప్ అన్నాడు. పావెల్ జీవితం చాలా చిత్రంగా ఉంటుందని కూడా ఆయ‌న చెప్పుకొచ్చాడు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News