ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్షాలతో పాటు మధ్యలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా హాట్ హాట్‌గా పొలిటికల్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో సభలు, సమావేశాలుపెట్టి పవన్ కల్యాణ్ అధికార పార్టీ నేతల వైఖరిని తూర్పారబడుతున్నారు.
ఇదే సమయంలో పవన్‌పై రివర్స్ అటాక్ చేస్తోంది అధికార పార్టీ. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా ముఖ్య నేతలంతా పవన్‌పై తిడ్ల దండకం ఎత్తుకుంటున్నారు. ఏపీలో రాజకీయాలు ఏ స్థాయిలో దిగజారిపోయాయంటే.. కేవలం తిట్టిపోసుకోవడానికే సభలు పెట్టుకుంటున్నట్లుగా పరిస్థితి మారిపోయింది.
పవన్ కల్యాణ్‌తోపాటు మెగా కుటుంబంపై ఇటీవల ఏపీ మంత్రి ఆర్కే రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో తీవ్ర దుమారం రేగింది. పవన్ కల్యాణ్ వైఖరి చూస్తే ఒక ఆర్టిస్టుగా సిగ్గుగా ఉందని రోజా వ్యాఖ్యలు చేశారు. ఆర్టిస్టులు సున్నితంగా ఉంటారని, సాయం చేసే గుణం ఉంటుందని రోజా చెప్పారు.
సినిమా ఇండస్ట్రీలో చరిత్రలో నిలిచిపోయిన ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్ లాంటి వాళ్లు మహోన్నత స్థాయికి ఎదిగారని, ప్రజల రుణం తీర్చుకొనేందుకు పాటుపడ్డారని రోజా గుర్తు చేశారు. కానీ మెగా కుటుంబం మాత్రం సొంత జిల్లాలో ఎవరికీ ఏ చిన్న సాయం కూడా చేయలేదని కాంట్రవర్సీ కామెంట్లు చేశారు రోజా.
అందుకే అన్నదమ్ములు ముగ్గుర్నీ ప్రజలు ఓడించారని చెప్పారు రోజా. పవన్ కల్యాణ్ ఎప్పుడెప్పుడు చంద్రబాబు భజన చేద్దామా అని ఎదురు చూస్తుంటారని, అందుకే ప్రజలు ఆయన్ను తిరస్కరిస్తున్నారని చెప్పారు. దీనిపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పవన్ కల్యాణ్ సైతం శ్రీకాకుళంలో నిర్వహించిన యువశక్తి సభలో రోజాపై కామెంట్స్ చేశారు.
డైమండ్ రాణిగా రోజాను పోల్చిన పవన్.. ప్రజల కోసం డైమండ్ రాణితో కూడా తిట్టించుకుంటున్నానని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో సైతం రోజాను మెగా అభిమానులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇలా రోజా వర్సెస్ పవన్ కల్యాణ్ మధ్య రాజకీయ డైలాగ్ వార్ నడుస్తోంది. ఎన్నికలు సమీపించే నాటికి ఇది మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.
also read:
Divita Rai: ప్రపంచ సుందరి బరిలో దివితా రాయ్.. ఆసక్తికర విశేషాలివే..
apple cultivation : యాపిల్ సాగుతో కోటీశ్వరులయ్యారు.. ఎవరు ? ఎక్కడ ?
Russia : రాబోయే పదేళ్లలో రష్యా పతనం తప్పదు.. సర్వే ఏం చెప్తుంది?