Roja Fire on Lokesh : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె.. లోకేష్ పాదయాత్రపై చురకలంటించారు. లోకేష్ అడుగు పెడితే నాశనమేనంటూ కీలక ఆరోపణలు చేశారు రోజా. ఇందుకు ఉదాహరణలు కూడా ఆమె వివరించారు. లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టిన రోజే నందమూరి తారకరత్న అస్వస్థతకు గురి కావడం ఇందుకు నిదర్శనమన్నారు. తారకరత్నను పరామర్శించే తీరిక కూడా లోకేష్‌కు లేదని మండిపడ్డారు.
తారకరత్న త్వరగా కోలుకోవాలని తాను కోరుకుంటున్నట్లు రోజా తెలిపారు. లోకేష్ వల్ల చంద్రబాబుకు ప్రమాదం పొంచి ఉందని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సైకో అయితే, లోకేష్ ఐరన్‌లెగ్ అని రోజా విమర్శలు చేశారు. లోకేష్ అడుగు పెట్టగానే పుష్కరాల్లో 29 మంది మృత్యుతవాత పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్సీగా మండలిలో లోకేష్ అడుగు పెట్టగానే చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో నోటీసులొచ్చాయని గుర్తు చేశారు.
యువగళం పోస్టర్ల విడుదల సందర్భంగా నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిది దుర్మరణం చెందారని విమర్శించారు. సీఎం జగన్ ఇచ్చిన మాట కోసం, తండ్రి ఆశయాలు నెరవేర్చడానికి రాష్ట్రమంతా తిరిగి పాదయాత్ర చేశారని రోజా తెలిపారు. అందుకే అధికారంలోకి వచ్చాక 98 శాతం హామీలను జగన్ నెరవేర్చారని రోజా తెలిపారు. జగన్ పాలన గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు లేదన్నారు.
పాదయాత్ర తొలి రోజే తన ప్రసంగాలతో కడుపుబ్బా నవ్వించిన లోకేష్.. అసలు తెలుగు సరిగా మాట్లాడలేని వ్యక్తి నాయకుడెలా అవుతాడని రోజా ప్రశ్నించారు. తాను మంత్రిగా చేసినప్పుడు రాష్ట్రానికి, ప్రజలకు ఏం ఒరగబెట్టాడని లోకేష్‌ను నిలదీశారు రోజా. అబద్ధాలు చెబుతూ ప్రజలను నమ్మించాలని చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారని రోజా చెప్పారు. గతంలో ఏ సీఎం చేయని విధంగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలను జగన్ కల్పించారని చెప్పారు. వలంటీర్ల వ్యవస్థతో ఇంటికే సంక్షేమ పథకాలు చేరుస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని రోజా తెలిపారు.
also read news:
Dasara Teaser : గూస్ బమ్స్ తెప్పిస్తున్న ‘దసరా’ తెలుగు మూవీ టీజర్
H-1B Visa : స్కిల్డ్ ప్రొఫెషనల్స్‌కు ఢోకా లేదు.. మళ్లీ హెచ్1బీ వీసా అప్లికేషన్ల ప్రక్రియ షురూ!
జార్ఖండ్‌లో నడిరోడ్డుపై చేపల వాహనం బోల్తా.. పోలీసుల చేతివాటం.. పైగా లంచం డిమాండ్!