HomesportsRohit: కోహ్లీ కెప్టెన్సీలో ఉన్న‌ది ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీలో లేనిది ఇదే.. అందుకే వ‌రుస ప‌రాజ‌యాలు..!

Rohit: కోహ్లీ కెప్టెన్సీలో ఉన్న‌ది ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీలో లేనిది ఇదే.. అందుకే వ‌రుస ప‌రాజ‌యాలు..!

Telugu Flash News

Rohit: టీమిండియానే కాదు.. టీమిండియా క్రికెట్‌ ఫ్యాన్స్‌ మొత్తం ఇప్పుడు ఫుల్‌ డిప్రెషన్‌లో ఉన్నారు. ప‌సికూన అని భావించే బంగ్ల‌దేశ్‌పై సిరీస్ ఓడిపోయారు. రెండు మ్యాచ్‌లు చేతులు దాకా వచ్చి చేజారిపోవడంతో అంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. తొలి వన్డేలో ఓడిపోతే ఇంకో రెండు ఉన్నాయిగా అని ధీమాగా ఉన్న ఫ్యాన్స్‌.. రెండో మ్యాచ్‌తో సిరీస్‌ కోల్పోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే పేలవ ప్రదర్శనను కొనసాగించారంటూ పెద‌వి విరుస్తున్నారు. బౌలర్లు మరీ తేలిపోవడాన్ని తప్పుబడుతున్నారు. ఆ ఆగ్రహ సెగలు అటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కూడా తగులుతూనే ఉన్నాయి. అంతా బాగా బ్యాటింగ్‌ చేసినా కూడా ఫ్యాన్స్‌ వదలట్లేదు.

బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఈ పర్యటన ప్రారంభానికి ముందే స్టార్ పేసర్ మహమ్మద్ షమీ, రిషభ్ పంత్‌లు దూరం కాగా, అక్షర్ పటేల్‌ ఫిట్‌నెస్ సమస్యలతో తొలి వన్డే ఆడలేదు. ఇక తొలి వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన యువ పేసర్ కుల్దీప్ సేన్.. వెన్ను నొప్పితో రెండో వన్డే‌కు దూరం అయ్యాడు. మ్యాచ్ ప్రారంభమయ్యాక క్యాచ్ పట్టే క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రంగా గాయపడి మైదానం వీడగా.. ఇండియ‌న్ పేసర్ దీపక్ చాహర్ మూడే ఓవర్లు బౌలింగ్ చేసి తొడ కండరాల గాయంతో బెంచ్‌కే ప‌రిమితం అయ్యాడు. అయితే యోయో టెస్ట్ క‌ఠినంగా చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే ఇలా జ‌రుగుతుందా అని కొంద‌రు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

టీమిండియా హెడ్ కోచ్‌గా రవి శాస్త్రి, కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఉన్న సమయంలో ఎంత పెద్ద ఆటగాడైనా సరే యో యో టెస్ట్‌లో అర్హత సాధిస్తేనే జట్టులోకి వ‌చ్చే వారు. గాయంతోనైనా.. ఇతర కారణాలతోనైనా జట్టుకు దూరమైన ఆటగాళ్లు.. మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలంటే యోయో టెస్ట్‌ అధిగమించి రావాల్సిందే. కోహ్లీ హయాంలో ఆటగాళ్లు జట్టుకు ఎంపికైనా.. యో యో టెస్ట్‌లో విఫలమై జట్టుకు దూరమైన సందర్భాలు చాలానే న్నాయి. రోహిత్ శర్మ కెప్టెన్ అయిన తర్వాత అస్స‌లు పదమే వినబడటం లేదు. అసలు యో యో టెస్ట్ నిర్వహిస్తున్నారా? లేదా? అనేది కూడా అర్ధం కావ‌డం లేదు. యో యో టెస్ట్ మాట ఏమో కానీ.. కావాల్సినంత విశ్రాంతి ఇస్తున్నా.. ఆటగాళ్లు గాయాల బారిన పడ‌డం, చెత్త ఫీల్డింగ్ వ‌ల‌న సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లను చేజార్చుకుంటున్నారు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News