Telugu Flash News

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ స్థానం మార‌నుందా.. ఫినిష‌ర్‌గా పంపాల‌నే ఆలోచ‌న‌లో ముంబై ఇండియన్స్

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ‌.. ఈ పేరు గురించి క్రికెట్ ప్రేమికుల‌కి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అద్భుత‌మైన ఆట‌తీరుతో టీమిండియా కెప్టెన్‌గా కూడా ప‌దవీ బాధ్య‌త‌లు అందుకున్నాడు రోహిత్ శ‌ర్మ‌. ఇక ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అనే సంగ‌తి తెలిసిందే. . అతను సాధించిన టైటిళ్లే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. 2013,2015,2017,2019,2020 సీజన్లలో ముంబై ఇండియన్స్‌ను రోహిత్ చాంపియన్‌గా నిలబెట్టాడు. బ్యాటర్‌గానూ 222 ఇన్నింగ్స్‌లో 5879 పరుగులతో టాప్‌లో కొనసాగుతూ వ‌స్తున్నాడు. అయితే 2017 సీజన్‌ నుంచి రోహిత్.. బ్యాటింగ్‌లో కాస్త‌ విఫలమవుతున్నాడు.

ఆరేళ్లలో ముంబై ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే అప్‌కమింగ్ సీజన్‌లో అతన్ని మిడిలార్డర్‌లో ఆడాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. రోహిత్ మిడిలార్డర్‌లో ఆడటం ముంబైకి బలాన్ని ఇస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే రోహిత్ ఓపెనర్‌గా వద్దనేందుకు మూడు బలమైన కారణాలున్నాయంటున్నారు. రోహిత్‌ను మిడిలార్డర్‌కు పంపిస్తే కామెరూన్ గ్రీన్‌ను ఇషాన్ కిషన్‌తో కలిపి ఓపెనర్‌గా పంపించవచ్చనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కామెరూన్ గ్రీన్ ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్‌గానే బరిలోకి దిగి సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే గ్రీన్‌ను ఓపెనర్‌గా పంపించి సూర్య, తిలక్ వర్మ, రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రేవిస్, టీమ్ డేవిడ్‌లతో మిడిలార్డర్ ప‌టిష్టం చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ఐపీఎల్‌లో రోహిత్ శర్మకు మిడిలార్డర్‌లో మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా ఐదో స్థానంలో 22 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ 33 సగటు, 144 స్ట్రైక్‌రేట్‌తో 563 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లో రోహిత్ మ్యాచ్ విన్నింగ్ నాక్స్ కూడా ఆడాడు. 2018లో ఆర్‌సీబీతో ఓ మ్యాచ్‌లో మిడిలార్డర్‌లో వచ్చిన రోహిత్ 52 బంతుల్లో 94 పరుగులతో జట్టును గెలిపించాడు. ఇది అతని కెరీర్‌కే హైలైట్‌గా నిలిచింది. ఒత్తిడితో కూడిన మ్యాచ్‌ల్లో రోహిత్.. యువ ఆటగాళ్లకు మార్గదర్శకంగా ఉండనున్నాడు. ఆ క్ర‌మంలో రోహిత్‌ని మిడిల్ లో పంపే ఆలోచ‌న చేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Exit mobile version