Telugu Flash News

Rohit Sharma : తెలుగులో మాట్లాడిన రోహిత్‌ శర్మ.. పదండి ఉప్పల్‌కు అంటూ…

rohit sharma ipl

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌, టీమిండియా సారథి రోహిత్‌ శర్మ (Rohit Sharma) తరచూ తెలుగులో మాట్లాడుతుంటాడు. రోహిత్‌ శర్మ వాళ్ల అమ్మమ్మది ఏపీలోని విశాఖపట్నం అని అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిన్నప్పుడు తరచూ అమ్మమ్మ వాళ్ల ఇంటికి వస్తున్న సందర్భాల్లో రోహిత్‌ తెలుగు చక్కగా మాట్లాడుతుండేవాడని చెబుతారు.

తర్వాత ముంబైలోనే స్థిరపడటంతో తెలుగును రోహిత్‌ మర్చిపోయాడని కుటుంబీకులు చెబుతారు. అయితే, ఇప్పటికీ తెలుగులో కొన్ని పదాలను రోహిత్‌ అప్పుడప్పుడూ మాట్లాడుతుంటారు. తాజాగా ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ సందర్భంగా రోహిత్‌ మళ్లీ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌ కోసం ముంబై ఇండియన్స్‌ జట్టు హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా మేం హైదరాబాద్‌కు వచ్చేసినాము.. ఎంఐ ఫ్యాన్స్‌.. పదండి ఉప్పల్‌ స్టేడియంకు.. అంటూ ఎంఐ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. ఈ వీడియోను ట్విట్టర్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌ అధికార ఖాతా నుంచి పోస్టు చేశారు. కెప్టెన్‌ రో హైదరాబాద్‌ వచ్చేశాడు అంటూ క్యాప్షన్‌ కూడా పెట్టారు.

అయితే, రోహిత్‌ ఇలా తెలుగులో వీడియో పెట్టడంతో ఇప్పుడు అభిమానులు ఖుషీ ఖుషీ అవుతున్నారు. అటు ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్‌తో పాటు ఇటు సన్‌ రైజర్స్‌ జట్టు అభిమానులు కూడా తెగ సంబరపడిపోతున్నారు.

IPL 2023 : తిలక్ వర్మకు అరుదైన గౌరవం.. చేతులు కలిపిన రిలయన్స్..

రోహిత్‌ శర్మ గతంలోనూ ఓ స్పోర్ట్స్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీకు నచ్చిన తెలుగు పదాలు పలకండి అని యాంకర్‌ అడగ్గానే.. చిన్నప్పుడు తెలుగులో మాట్లాడేవాడినని.. ఇప్పుడు తనకు అంతగా గుర్తు లేదని, కొన్ని పదాలే గుర్తున్నాయన్నాడు. ఆ సందర్భంలో ఎలా ఉన్నారు.. అని ప్రశ్నించారు.

రోహిత్ శర్మ పుట్టింది ముంబైలోనే. అయినప్పటికీ అతనికి తెలుగు రాష్ట్రాలతో విడదియ్యరాని అనుబంధం ఉంది. ఐపీఎల్ అరేంగ్రటం డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌తోనే చేశాడు హిట్‌ మ్యాన్‌. రోహిత్ తల్లి పుర్ణిమా పుట్టింది వైజాగ్ లోనే. అందుకే హైదరాబాద్, విశాఖపట్నం వచ్చినప్పుడల్లా రోహిత్‌ సందడి చేస్తుంటాడు.

Sukumar: విరూపాక్ష డైరెక్ట‌ర్ గురించి సుకుమార్ చెప్పిన షాకింగ్ నిజాలు..!

రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్‌ అయ్యింది. అభిమానులు తెగ షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఆల్‌ ది బెస్ట్‌.. అండ్‌ వెల్‌కమ్‌ టు హైదరాబాద్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఉప్పల్‌లో భారీ ఇన్నింగ్స్‌ ఆడాలని కోరుతున్నారు.

Exit mobile version