Telugu Flash News

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ ఇంట విషాదం… బాధ‌లోను అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడిన హిట్‌మ్యాన్

Rohit Sharma: న్యూ ఇయ‌ర్‌లో రోహిత్ శ‌ర్మ‌, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్ ఆడారు. రెస్ట్ త‌ర్వాత శ్రీలంక‌తో వ‌న్డే సిరీస్‌కి బ‌రిలోకి దిగిన ఈ ముగ్గురు మంచి ట‌చ్‌లో క‌నిపించారు. ముఖ్యంగా రోహిత్ కూడా మంచి ఇన్నింగ్స్ సాగించాడు. అయితే బంగ్లాదేశ్‌ టూర్ లో గాయపడ్డ రోహిత్, కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం ఈ మ్యాచ్ ఆడాడు. కేవ‌లం 41 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న హిట్ మ్యాన్, మొత్తంగా 67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి ధాటిగా ఆడిన రోహిత్‌ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

మధుశంక బౌలింగ్‌లో బంతి ఇన్‌ సైడ్‌ ఎడ్జ్‌ తీసుకోవడంతో దురుదృష్ట‌వ‌శాత్తు రోహిత్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాక ఆకాశం వైపు చూస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. అందుకు కారణం.. వారింట విషాదం నెలకొనడమే అని అంటున్నారు. హాఫ్ సెంచరీ మార్క్ చేరుకోగానే.. రోహిత్ ఆకాశం వైపు చూస్తూ ‘మ్యాజిక్’ అన్నాడు. మ్యాజిక్.. అనేది అత‌ని పెంపుడు కుక్క పేరు. ఈ అర్ధ శతకాన్ని రోహిత్ తమ పెంపుడు శునకానికి అంకితం చేశాడని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు..

త‌ము ప్రాణంగా పెంచుకున్న‌ పెంపుడు శునకం మ్యాజిక్ చనిపోయిందని రోహిత్ భార్య ‘రితిక’ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. తన పెద్ద బిడ్డను కోల్పోయినంత బాధగా ఉందంటూ ఆమె భావోద్వేగానికి లోనైంది. ఆమె చేసిన పోస్టుపై సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ ప్రేయసి అతియా శెట్టి, ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు తిలక్ వర్మ మొదలైన వారు స్పందించారు. అయితే శ్రీలంకతో మ్యాచ్ ఆడేందుకు అతను సిద్ధం అవుతున్న సమయంలోనే ఈ విషాదం చోటు చేసుకోవడం బాధాకరం. ఆ బాధ‌తోనే రోహిత్ (83) ప‌రుగులు చేశాడు. అంద‌రు రాణించ‌డంత టీమిండియా, శ్రీలంక ముంగిట 373 పరుగుల భారీ టార్గెట్ నిర్ధేశించింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక ల‌క్ష్యాన్ని చేరుకోలేక తొలి వ‌న్డేలో ప‌రాజ‌యం చ‌వి చూసింది.

 

Exit mobile version