India: ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ 20 వరల్డ్ కప్‌లో టీమిండియా ప్రదర్శన పట్ల అభిమానులు ఎంతగా హర్ట్ అయ్యారో తెలిసిందే. బీసీసీఐ కూడా ఈ విషయంపై చాలా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. చేతన్ శర్మ నేతృత్యంలోని నేషనల్ సెలక్షన్ కమిటీ మొత్తాన్ని ఇంటికి పంపేయడంతో ఇప్పుడు కొత్త కమిటీ కోసం దరఖాస్తులు కూడా ఆహ్వానించారు. మరికొన్ని రోజుల్లోనే ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త సెలెక్షన్ కమిటీని ఏర్పాటు కానుంది.. అయితే.. వరల్డ్ కప్ ఫెల్యూర్‌పై బీసీసీఐ మరిన్ని చర్చలు తీసుకోనున్నట్లు సమాచారం అందుతుంది.
కొత్త సెలక్షన్ కమిటి వస్తే టీమిండియాలో పలు మార్పులు జరగడం ఖాయం అనే సమాచారం అందుతుంది. ఈ వార్తల ప్రకారం.. మొదట టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై వేటు పడే అవకాశం ఉన్నట్లు టాక్. అంతర్జాతీయంగా బిజీ షెడ్యూల్స్ ఉన్న నేపథ్యంలో వన్డే, టెస్టులు ఒక కెప్టెన్, టీ20 లాంటి ఫాస్ట్ ఫుడ్ ఫార్మాట్‌కు మరో కెప్టెన్ ఉండేలా బీసీసీఐ ఆలోచన చేస్తుందని సమాచారం.
ఈ క్రమంలో రోహిత్ శర్మను టీ20 కెప్టెన్‌గా తొలగించి, అతని స్థానంలో హార్దిక్ పాండ్యాను టీ20 జట్టుకు రెగ్యులర్ కెప్టెన్‌గా కొనసాగించనున్నారు. అయితే.. రోహిత్ శర్మను వన్డే, టెస్టు జట్టు కెప్టెన్‌గా కొనసాగిస్తారా? లేదా? అనే విషయంపై కూడా స్పష్టత లేదంటూ కొందరు చెబుతున్నారు.
ఇప్పటికే విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడిని వన్డే కెప్టెన్‌గా తొలగించి గంగూలీ పెద్ద తప్పు చేశాడనే విమర్శలు ఉండగా, రోహిత్‌ని తొలగిస్తే కూడా తప్పక విమర్శలు రావడం ఖాయం అని అంటున్నారు.
టీ20లకు ఎక్కువగా యువ క్రికెటర్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే రోహిత్ శర్మను కెప్టెన్‌గా తొలగిస్తూ.. ఆ బాధ్యతలు పాండ్యాకు అప్పగిస్తున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ దీనికి అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
కాగా.. వరల్డ్ కప్‌లో సూపర్ 12లో పాకిస్థాన్ పై విజయం మినహా పెద్ద గొప్ప ప్రదర్శన చేయని టీమిండియా.. సెమీస్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్ ముందు చేతులెత్తేసిన విషయం తెలిసిందే.
also read news:
ఈ పచ్చడి కళ్లకు ఎంతో మేలు.. ఇంకెందుకు ఆలస్యం.. మీరు చేసుకోండి..