Homebigg boss telugu season 6Bigg Boss telugu 6: రేవంత్ ఓవ‌రాక్ష‌న్.. రోహిత్ రెండు వారాలు నామినేట్

Bigg Boss telugu 6: రేవంత్ ఓవ‌రాక్ష‌న్.. రోహిత్ రెండు వారాలు నామినేట్

Telugu Flash News

Bigg Boss telugu 6: బిగ్ బాస్ సీజ‌న్ 6 కార్య‌క్ర‌మంలోని కెప్టెన్సీ టాస్క్ చాలా ఎమోష‌న‌ల్‌గా సాగుతుంది. బాల‌దిత్య త‌న భార్య‌తో మాట్లాడి ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఇక ఆర్జే సూర్య‌.. ఇన‌య‌తో క‌లిసి దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. ఇది చూసి కొంద‌రు పెద‌వి విరుస్తున్నారు. ఇక స్మోకింగ్‌కి బాగా అడిక్ట్ అయిన బాలాదిత్య సిగరెట్స్ లేక‌పోవ‌డంతో చాలా ఒత్తిడికి ఫీల‌యిన‌ట్టు క‌నిపించాడు.

బిగ్ బాస్ కెమెరాల దగ్గరకు వెళ్లి ప్లీజ్ బిగ్ బాస్.. టాస్క్ ఆగిపోయింది కదా.. నాకు కొన్ని సిగరెట్లు పంపించండి అని రిక్వెస్ట్ చేశాడు. ఆ త‌ర్వాత కూడా సిగ‌రెట్స్ కోసం ఎంతో ప్రాధేయ‌ప‌డ్డాడు. ఇది చూసి గీతూ పైశాచిక ఆనందం పొందింది. ఇక సూర్య జైలు పక్కన ఉన్న సందులో పడుకుని ఇనయని గోకుతూ.. ఆమె చేతిపై ఏవో కోడ్ లాంగ్వేజ్‌లో రాస్తూ క‌నిపించాడు.

మ‌రీ ఇంత అవ‌స‌రమా..

ఇక ఐ లవ్యూ అమ్మా.. నాకేం కోపం లేదు.. నిన్ను బాగా మిస్ అవుతున్నాను అంటూ క‌న్నీళ్లు పెట్టుకున్నాడు సూర్య‌. ఇక సూర్య‌, ఇన‌య ఇద్ద‌రు ఒకే లాలిపాప్ తింటూ బిగ్ బాస్ హౌజ్‌ని ల‌వ‌ర్స్ పార్క్‌గా మార్చేశారు.

ఇక ఆదిరెడ్డి.. కెప్టెన్ రేవంత్ దగ్గరకు వెళ్లి.. ‘కెప్టెన్ మధ్యాహ్నం పూట రైస్ కాస్త ఎక్కువ పెట్టండి.. రైస్ సరిపోవడం లేదు కదా అని అడ‌గ‌డంతో కాస్త అతి చేస్తూ క‌నిపించాడు. ‘రైస్ వేస్ట్ కాకూడదు.. ఇంత కూడా రైస్ వేస్ట్ అయితే ఒప్పుకోను’ అని అన్నాడు రేవంత్. అదేంటి బ్రో.. మీ కెప్టెన్సీలో అన్నం లేక ఇబ్బంది పడటం మీకు ఇష్టమా? అని ఆదిరెడ్డి అడ‌గ‌గా, కాస్త అతి చేస్తూ క‌నిపించాడు రేవంత్.

ఇక రోహిత్, వాసంతిలకు బ్యాట‌రీలు రీచార్జ్ చేసుకునే అవ‌కాశం ఇచ్చారు బిగ్ బాస్. ఇద్ద‌రిలో ఒకరు రెండువారాలు నేరుగా నామినేట్ అయితే బ్యాటరీ రీచార్జ్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్ప‌డంతో రోహిత్ డైరెక్ట‌ర్‌గా నామినేట్ అవుతాన‌ని చెప్పాడు.

ఇక రేవంత్ తొలి ఫోన్ కాల్ తీసుకోగా, అత‌నికి రెండు ఆప్ష‌న్స్ ఇచ్చారు. మీ భార్య సీమంతానికి మీరు పంపిన వస్తువులు ఇంటికి చేరిన వీడియో చూడాలనుకుంటే 25 శాతం చార్జింగ్ ఖ‌ర్చు అవుతుంది. అది కాదు మీ భార్య ఫొటో చూడాలి అనుకుంటే 10 శాతం బ్యాట‌రీ ఖ‌ర్చు అవుతుంది. ఈ రెండింట్లో చాయిస్ అడ‌గ‌డంతో భార్య ఫొటో చాలు అని అన్నాడు. అయితే వీడియోలో భార్య‌ని చూసే అవ‌కాశం మిస్ కావ‌డంతో తెగ ఏడ్చాడు రేవంత్.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News