Rohini: జబర్ధస్త్ షో ద్వారా చాలా మంది కమెడీయన్స్ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. లేడీ కమెడీయన్స్‌కి కూడా గుర్తింపు దక్కింది. అలా లేడి కమెడీయన్స్ గుర్తింపు తెచ్చుకున్న వారిలో జబర్ధస్త్ రోహిణి ఒకరు. సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రోహిణి.. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లి అలరించింది. ఇక అక్కడ నుండి జబర్దస్త్ ,ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షో లో పాల్గొంటూ తెగ సందడి చేస్తుంది.. ఈ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రోహిణి ఎక్స్ట్రా జబర్దస్త్ లో కూడా టీం లీడర్ గా చేసింది. ఇక ఇలా పలు షోలతో పాటు సినిమాలలో అలరిస్తూ వస్తున్న ఈ అమ్మడు.. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లో వేసే పంచుల బూతులు పీక్స్ లో ఉంంటాయి. బుల్లితెరపై లేడీ కమెడియన్ గా రోహిణి అయితే ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తోంది.
నవ్వించడం మాత్రమే కాకుండా అవసరం అయినప్పుడు అదిరిపోయే స్టెప్పులతో రోహిణి డ్యాన్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే నవ్వించే వారికి ఎన్నో కష్టాలు ఉంటాయి. వాటిని కనిపించకుండా మనలని అలరిస్తూ ఉంటారు. అలా రోహిణి జీవితంలోను ఎవరికీ తెలియని కన్నీటి గాధలు ఉన్నాయి. గతంలో ఎదురైనా సమస్యల వల్ల రోహిణి ఇప్పటికి ఇబ్బందులు పడుతూనే ఉందట. ఈ విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చింది. 2016లో రోహిణి తీవ్రమైన యాక్సిడెంట్ కి గురి కాగా, అప్పుడు వైద్యులు సర్జరీ చేసి రాడ్ వేశారు. అయితే ఇప్పుడు అదది నయం అయినప్పటికీ లోపల రాడ్ ఉండడం వల్ల డ్యాన్స్ చేయడం కాస్త ఇబ్బందిగానే ఉంటోంది అని రోహిణి పేర్కొంది.
రాడ్ వేసి చాలా ఏళ్లు కావడంతో రాడ్ తీయించి వేద్దాం అని ఆసుపత్రికి తీసుకిళితే అన్ని పరీక్షలు నిర్వహించి మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ థియేటర్ కి తరలించారట. అయితే ఎముక లోపల రాడ్డు బాగా కూరుకుపోవడంతో ఎంత ప్రయత్నించిన కూడా బయటకు రాలేదు. బలవంతంగా బయటకి తీస్తే ఎముక దెబ్బతిని మరోసారి విరిగిపోయే ప్రమాదం ఉందని డాక్టర్స్ చేతులెత్తేశారు. అయితే డ్యాన్స్ చేసేటప్పుడు మాత్రం నొప్పి రాకుండా కొన్ని రకాల మందులు ఇచ్చారట. కాస్త ఇబ్బందిగా ఉన్నా రాడ్డుని అలాగే ఉంచుకోవడం బెటర్ అని వైద్యులు చెప్పడంతో చేసేదేం లోక లోపల రాడ్డుని అలానే ఉంచుకుంది. అయితే రాడ్డు తీయించుకుని మరింత ఉత్సాహంగా బుల్లితెర షోలలో పాల్గొనాలని ప్రయత్నించిన రోహిణికి ఇది నిరాశ అని చెప్పాలి. కాని అప్పటి యాక్సిడెంట్ తలచుకుంటే ఇప్పటికి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అంటూ రోహిణి చాలా ఎమోషనల్‌గా మాట్లాడింది.