Telugu Flash News

Rakesh-Sujatha : ఏంటి.. అప్పుడే రాకింగ్ రాకేష్‌, సుజాతల మ‌ధ్య గొడ‌వ‌లా..!

Rakesh-Sujatha : సెల‌బ్రిటీల జీవితాలు ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్ప‌డం క‌ష్టం. అప్ప‌టి వ‌రకు మంచిగా ఉన్న వారు ఆ త‌ర్వాతి క్ష‌ణంలోనే విడిపోతున్నారు. ఇటీవ‌ల ఇండ‌స్ట్రీకి చెందిన చాలా మంది జంట‌లు విడిపోవడం మ‌నం చూశాం. స‌మంత‌- నాగ చైత‌న్య జంట విడాకులు తీసుకోవ‌డం ప్ర‌తి ఒక్క‌రిని బాధించింది. అయితే ఇటీవ‌ల జోర్దార్‌ సుజాత, రాకింగ్‌ రాకేష్‌. తిరుపతి వెంకన్న సన్నిధిలో ఒక్కటి కాగా, వారి జంట‌ని చూసి ప్ర‌తి ఒక్కరు చూడ ముచ్చ‌ట‌గా ఉంద‌ని ప్ర‌శంస‌లు కురిపించారు.

అయితే అన్యోన్యంగా సాగుతున్న వారి సంసారంలో కలతలు మొదలయ్యాయ‌ని, ఒకరంటే ఒకరు పడని స్థాయికి చేరుకుంద‌ని ప్ర‌చారాలు సాగుతున్నాయి. అయితే అదంతా రీల్ లైఫ్ సంఘ‌ట‌న మాత్ర‌మే. తాజాగా రాకేష్‌, సుజాత కాంబినేషన్‌లో వచ్చిన స్కిట్ కి సంబంధించి ప్రోమో విడుదలయింది. ఇందులో రాకేష్‌, సుజాత గొడవ పడుతుండ‌గా, అదే తనకు కావాలని ప్రవీణ్‌ అంటాడు.

Jabardasth | Sowmya Rao : జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్ ఎవ‌రు లేని అనాథ‌నా ? తన స్టోరీ ఏంటి ?

ఇలా సాగుతుండగానే ఇద్దరూ ఒకరిపై ఒకరు చేయి కూడా చేసుకుంటారు. దీంతో సుజాతతో పడలేనని రాకేష్ వెళ్లిపోతున్న స‌మ‌యంలో వ‌ర్ష ఎదురుప‌డ‌డంతో ఆమెని ఆలింగ‌నం చేసుకుంటాడు. ఇది చూసి సుజాత కోపం పీక్స్ లోకి వెళుతుంది. కొట్టేందుకు కూడా వెన‌కాడ‌దు. చాలా ఫ‌న్‌గా సాగిన ఈ స్కిట్ ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అలరిస్తుంది.

Exit mobile version