HomesportsRishabh Pant : కోలుకున్న పంత్.. కారు ప్ర‌మాదానికి ఇది అస‌లు కార‌ణం అని చెప్పిన రిష‌బ్

Rishabh Pant : కోలుకున్న పంత్.. కారు ప్ర‌మాదానికి ఇది అస‌లు కార‌ణం అని చెప్పిన రిష‌బ్

Telugu Flash News

Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఘోర కారు ప్రమాదానికి గురైన ఘటన ఆయ‌న అభిమానుల‌ని ఎంత‌గా క‌ల‌వ‌ర‌ప‌రుస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తన తల్లిని సర్‌ప్రైజ్ చేయడానికని ఇంటికి వెళ్తూ కారు డివైడర్ కు ఢీకొట్టడంతో ప్రమాదానికి గురైన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆరోగ్యానికి సంబంధించి ఓ కీలక అప్టేడ్ వెలువడింది. ప్రమాదంలో పంత్ ముఖానికి పలు గాయాలు కావ‌డంతో రిషభ్ కు డెహ్రాడూన్ లో వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టు స‌మ‌చారం. దానిని డెహ్రాడూన్ లోనే పూర్తి చేసినట్టు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) డైరెక్టర్ శ్యామ్ పేర్కోన్నారు. డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రిలో అతడికి ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించినట్టు స‌మాచారం.

అయితే నిద్ర‌మ‌త్తు వ‌ల‌న అని కొంద‌రు తాగి కారు న‌డిపాడ‌ని మ‌రి కొంద‌రు పంత్ యాక్సిడెంట్ గురించి చెప్పుకొస్తుండ‌గా, రోడ్లపై గుంతను తప్పించే క్రమంలో రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని జాతీయ మీడియా పేర్కొంది. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రిషబ్ పంత్ ను ఢిల్లీ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ కలిసి మాట్లాడ‌గా, ఆ సమయంలో శ్యామ్ శర్మతో పంత్ తనకు యాక్సిడెంట్ జరిగిన తీరును వివరించాడు. అనంతరం శ్యామ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ… కారులో వెళ్తున్న సమయంలో రోడ్డుపై గుంత అడ్డుగా ఉందని, దాన్ని తప్పించే క్రమంలో కారు డివైడర్ కు ఢీ కొట్టిందని రిషబ్ పంత్ తనతో చెప్పాడని ఆయ‌న పేర్కొన్నారు.

రిష‌బ్ పంత్ చికిత్స‌కు అయ్యే ఖర్చును అంతా ఉత్తరాఖండ్ ప్రభుత్వ భరిస్తోంది. పంత్ బీసీసీఐతో కాంట్రాక్టు ఉన్న క్రికెటర్ అన్న విషయం తెలిసిందే. అతడి ఆరోగ్యంపై బీసీసీఐ నిత్యం వైద్యులతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. అయితే వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు 2022 సంవ‌త్స‌రం ఏమాత్రం కలిసి రాలేదు. సంవత్సరం ఆరంభం బాగానే జరిగినా ఆ ఆనందం అతనికి ఎంతో కాలం నిలవలేదు. ఒకదాని తర్వాత ఒకటి చొప్పున వరుస కాంట్రవర్సీలు అతని జీవితాన్ని అతలాకుతలం చేశాయి. ఏడాది చివర్లో భయంకరమైన యాక్సిడెంట్‌ పంత్‌ను కనీసం ఆరు నెలలపాటు క్రికెట్‌కు దూరం చేస్తుందని సమాచారం.

మరిన్ని వార్తలు చదవండి :

తెలంగాణ వార్తలు  |  జాతీయ వార్తలు  |  సినిమా వార్తలు  |  అంతర్జాతీయ వార్తలు  |  ఆరోగ్య చిట్కాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News