Telugu Flash News

Rishabh Pant: పంత్‌కి స్పోర్ట్స్ కార్లంటే పిచ్చి.. డ్రైవ‌ర్స్ లేకుండానే కిలో మీట‌ర్ల ప్ర‌యాణం

Rishabh Pant met with Accident

Rishabh Pant: టీమిండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డిన విష‌యం తెల‌సిందే. ఎంతో భ‌విష్య‌త్ ఉన్న పంత్ ఇలాంటి ప్ర‌మాదానికి గురి కావ‌డం ప‌ట్ల ప్ర‌తి ఒక్క‌రు ఆందోళ‌న చెందుతున్నారు. కారు యాక్సిడెంట్‌లో పంత్ తీవ్రంగా గాయపడడంతో క్రికెట్ ప్రపంచం షాక్‌కి గురైంది. పంత్ త్వరగా కోలుకుని, క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని క్రికెటర్లు, అభిమానులు కోరుకుంటున్నారు. అయితే క్రిస్‌మస్ రోజున ముగిసిన రెండో టెస్టుతో బంగ్లాదేశ్ టూర్ ముగించుకున్న టీమిండియా, డిసెంబర్ 26న ముంబై చేరుకుంది. అనంత‌రం నేరుగా జార్ఖండ్ వెళ్లిన రిషబ్ పంత్, భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంటికి వెళ్లాడు. అక్కడ మాహీ భాయ్‌తో కలిసి ఓ పార్టీలో పాల్గొన‌గా అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చల్ చేఆయి.

ఇక జార్ఖండ్ నుంచి న్యూఢిల్లీలోకి తన ఇంటికి వెళ్లేందుకు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బయలుదేరాడు రిషబ్ పంత్. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. రాత్రంతా నిద్రలేకుండా కారు నడుపుతుండడంతో రిషబ్ పంత్ కునుకు తీయడంతో కారు అదుపు తప్పి డివైడర్‌ని ఢీ కొట్టిన‌ట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే రిషబ్ పంత్‌కి స్పోర్ట్స్ కార్లు, లగ్జరీ కార్లంటే అమితమైన ఇష్టం. భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో 2017లోనే ఆడీ A8 కారుని కొనుగోలు చేసిన రిషబ్ పంత్, మెర్సిండేజ్ బెంజ్ సీ క్లాస్, ఫోర్డ్ ముస్తంగ్, మెర్సిండేజ్ జీఎల్‌ఈ వంటి ఖరీదైన కార్లను సొంతం చేసుకున్నాడు.

రిషబ్ పంత్‌కి కార్లంటే ఎంత ఇష్టమంటే ఎన్ని కార్లు కొనుక్కున్నా కూడా ఏనాడు డ్రైవర్‌ని మాత్రం పెట్టుకోలేదు. తానే స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ కిలో మీట‌ర్ల దూరం వెళ్లిపోతాడు. అయితే ఇన్నాళ్లు పంత్ కి ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌పోయిన ఇప్పుడు ఆయ‌న రాత్రంతా పడుకోకుండా డ్రైవ్ చేయ‌డంతో ప్ర‌మాదం బారిన ప‌డ్డాడు. ఇక పంత్ డబ్బులు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లినట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని, తానే స్వయంగా పంత్ బ్యాగ్, డబ్బులను అంబులెన్స్‌లో అందజేసానని బ‌స్ డ్రైవ‌ర్ చెప్పాడు. తాను పంత్‌ని గుర్తు ప‌ట్ట‌లేద‌ని, ప్రయాణికులు గుర్తు ప‌ట్ట‌డంతో అంబులెన్స్ కి ఫోన్ చేసి ఆసుప‌త్రికి త‌ర‌లించామ‌ని ఆయ‌న అన్నారు.

Exit mobile version