Ridge Gourd : మన పెరట్లో విరివిగా దొరికే కూరగాయలలో బీరకాయ ఒకటి. దీనిని మనం పలు రకాలుగా తీసుకోవచ్చు. బీరకాయను కూరగాను, పచ్చడిగాను చేసుకోవచ్చు. తీగజాతికి చెందిన బీరకాయ సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటుంది. ఇది ఉదర సంబంధిత వ్యాధులను నయం చేయడంతో పాటు తొందరగా జీర్ణమౌతుంది. ఇందులో డైటరీ ఫైబర్స్, వాటర్ కంటెంట్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం మరియు విటమిన్ బి6 వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది సహజంగా తక్కువ కేలరీల కంటెంట్, అనారోగ్యకరమైన సంతృప్త కొవ్వులు , కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది.
చాలా ప్రయోజనాలు..
ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఆల్కలాయిడ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉండడం వలన జీవక్రియను మెరుగుపరుస్తాయి. శరీరం నుండి విషపదార్ధాలను కూడా తొలగిస్తుంది. విటమిన్ ఎ గణనీయమైన మొత్తంలో ఉండటం వల్ల పెద్ద వయసు వారిలో కంటి చూపు మెరుగుపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే బీరకాయను కూరగా చేసినప్పుడు మనలో చాలా మంది పై తొక్క పూర్తిగా తీసేసి తింటుంటారు. కాని పోషకాలు ఎక్కువగా అందులోనే ఉంటాయి. పొట్టుతో కూర వండుకోవచ్చు. లేదంటే పొట్టుని పచ్చడిగా కూడా చేసుకొని తినవచ్చు. బీరకాయ తీసుకోవడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారు వారంలో రెండు లేదా మూడుసార్లు బీరకాయ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బీరకాయలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండం వలన రక్తంలో, యూరిన్ లో చక్కెర స్థాయిలను కలవకుండా అడ్డుకుంటాయి. బీరకాయలో పెప్టైడ్స్, ఆల్కలాయిడ్స్ సమృద్దిగా ఉండుట వలన ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. కామెర్ల వ్యాధి సహజంగా తగ్గాలంటే రోజు ఒక గ్లాసు బీరకాయ రసం తాగితే చాలు. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది