వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (RGV) లేటెస్ట్గా చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ చేసే వర్మ.. తాజాగా పవన్ కల్యాణ్, చంద్రబాబు, నాదెండ్ల మరోహర్పై సంచలన ట్వీట్లు చేశారు. ఆనాడు జూలియస్ సీజర్‌ను బ్రూటస్.. ఎన్టీఆర్‌ను నాదెండ్ల భాస్కర్ రావు, తర్వాత ఎన్టీఆర్‌ను మళ్లీ నారా చంద్రబాబునాయుడు వెన్ను పోటు పొడిచినట్టే.. ఈసారి పవన్ కల్యాణ్‌ను నాదెండ్ల మనోహర్, చంద్రబాబు కలిసి వెన్నుపోటు పొడుస్తారని తనకు కలలో దేవుడు చెప్పాడంటూ వర్మ ట్వీట్ చేశారు.
అయితే, వర్మ ట్వీట్లపై నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. నువ్వు దేవుడిని నమ్మవు కదా.. అంటూ ఒకరు క్వశ్చన్ చేశారు. పేటీఎం దేవుడు చెప్పాడా? అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు. ఆ దేవుడెవరో మా కలలోకి కూడా రమ్మనండి.. అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు. ఇక చంద్రబాబు, పవన్ అభిమానులు అయితే బూతులతో రెచ్చిపోతున్నారు. వర్మకు ఇలాంటివే మరింత కిక్కిస్తాయంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.
ఆ నాడు జూలియస్ సీజర్ ని బ్రూటస్ , ఎన్టీఆర్ ని #నాదెండ్లభాస్కర్‌రావు , ఎన్టీఆర్ ని మళ్ళీ @ncbn వెన్ను పోటు పొడిచినట్టే ఈసారి @pawankalyan ని #నాదెండ్లమనోహర్ , @ncbn ఇద్దరూ కలిసి వెన్నుపోటు పొడుస్తారని నాకు రాత్రి కలలో దేవుడు చెప్పాడు
— Ram Gopal Varma (@RGVzoomin) January 28, 2023
తాజాగా తెలుగుదేశం, జనసేన పార్టీలను ఉద్దేశించి రామ్‌గోపాల్ వర్మ ట్వీట్లు చేస్తున్నారు. వర్మను వైసీపీ పొలిటికల్‌గా బాగా వాడుకుంటోందని కొందరు చెబుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు, హీరోలు కూడా తెలుగుదేశం, జనసేన పార్టీలకు మద్దతుగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే సినీ బ్రాండ్ కొంత వైసీపీకి దగ్గర కావాలనే ఉద్దేశంతోనే పార్టీ అధిష్టానం ఆర్జీవీని పావులా వాడుకుంటోందని చెబెతున్నారు.
ఇటీవల పవన్, చంద్రబాబు భస్త్రటీపై కూడా పవన్ ట్వీట్లతో విరుచుకుపడ్డారు. డబ్బు కోసం కాపులను కమ్మ వాళ్లకి అమ్మూస్తాడని ఊహించలేదంటూ బహిరంగంగా కులం పేరు వాడి ట్వీట్లు చేయడం సంచలనం రేపింది. రిప్ కాపులు, కంగ్రాట్స్ కమ్మోళ్లు అంటూ వర్మ ట్వీట్లో పేర్కొన్నారు. దీనిపై పవన్ సోదరుడు నాగబాబు మండిపడ్డారు. అవసరం కోసం వర్మ ఎంత నీచానికైనా దిగజారుతాడంటూ ఫైర్ అయ్యారు నాగబాబు. తాజాగా లోకేష్ పాదయాత్రపై కూడా రామ్‌గోపాల్ వర్మ ట్వీట్లు, వీడియోలతో హల్చల్ చేస్తున్నారు.
అవసరం కోసం రామ్ గోపాల్ వర్మ ఎంతకు అయినా సరే దిగజారుతాడని, వాడు సన్నాసి వెధవ అంటూ నాగబాబు స్పందించారు. కులాన్ని పట్టుకుని నోటికి వచ్చినట్లు మాట్లాడటం తప్పని, దీన్ని బట్టి మనుషులను ఆయన ఎంత చులకనగా చూస్తున్నారో అర్థమవుతుందని పేర్కొన్నారు. అప్పుడు నాగబాబు మీద వర్మ విరుచుకు పడ్డారు. తాను పవన్ అభిమానిగా ట్వీట్లు చేశారని, ఆ విషయం నాగబాబు అర్థం కాకపోతే తన కంటే అది పవన్ చేసుకున్న దురదృష్టమని వర్మ వీడియో విడుదల చేశారు. ఇప్పుడు దేవుడు కలలోకి వచ్చి చెప్పాడంటూ వెన్నుపోటు ట్వీట్ చేశారు.
also read:
Aryna Sabalenka: అవమానాలే నిచ్చెనమెట్లుగా చేసుకొని.. సబలెంకా విక్టరీపై ప్రశంసల వర్షం!