HomecinemaRGV: త‌న డైరెక్ష‌న్ చెత్త అంటూ త‌న‌కి తానే విమ‌ర్శ‌లు చేసుకున్న వ‌ర్మ‌

RGV: త‌న డైరెక్ష‌న్ చెత్త అంటూ త‌న‌కి తానే విమ‌ర్శ‌లు చేసుకున్న వ‌ర్మ‌

Telugu Flash News

RGV: సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఇటీవ‌ల వివాదాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడు ఎదుటి వారిపై విమ‌ర్శ‌లు చేసే వ‌ర్మ తాజాగా త‌న‌పై తానే పంచ్‌లు వేసుకున్నాడు. తన జీవితంలో తీసిన చెత్త సినిమాల గురించి ప్రస్తావిస్తూ తన డైరెక్షన్ పైనే షాకింగ్ కామెంట్లు చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

నా దృష్టిలో నేను తీసిన చెత్త సినిమా ఏది అని అడిగితే అంతం అని చెబుతాన‌ని వ‌ర్మ అన్నాడు. అంతం క‌న్నా కూడా ఇత‌ర సినిమాలు ఫ్లాప్ అయి ఉండవచ్చు. కొంతమందికి అంతం సినిమా కూడా నచ్చి ఉండవచ్చు . అయితే నా దృష్టిలో మాత్రం అత్యంత చెత్త సినిమా ఏంటి అంటే అది అంత్రం మాత్ర‌మే.

నేను ప్రతి సినిమా చేయ‌డానికి నా ద‌గ్గ‌ర సోర్స్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతంలో ఉన్న సోర్స్ మెటీరియల్ వల్ల నేను తీయాలనుకున్నది తీయలేకపోయాను అందువల్లే ఈ సినిమా నా దృష్టిలో బ్యాడ్ మూవీ అంటూ వ‌ర్మ ఆశ్చ‌ర్య‌క‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

రాత్రి సినిమా విష‌యానికి వ‌స్తే ఇది సోర్స్ మెటీరియల్ లేని మూవీ. దీనిని కేవ‌లం టేకింగ్ ద్వారా ఆ మూవీ తీశాను. ఆ సినిమా ఫ్లాప్ అయిన హిట్ అయిన కూడా ఆ చిత్రం నా దృష్టిలో గ్రేట్ అంటూ ఆర్జీవి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

also read :

moral stories in telugu : చెప్పుడు మాటలు వింటే చెడిపోతారు జాగ్రత్త !

-Advertisement-

Keerthy Suresh Looks Stylish at Netflix Red Carpet Event

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News