Telugu Flash News

కాంతారా సినిమాను పొగుడుతూ RGV వ్యాఖ్యలు..భారీ బడ్జెట్ మూవీ మేకర్స్ కి హార్ట్ ఎటాక్ వస్తుందేమో!

rgv comments on kantara

rgv comments on kantara

రిషబ్ శెట్టి (rishabh shetty) నటించిన ఈ కన్నడ సినిమా కాంతారా (kantara) ఈమధ్యనే 100 కోట్ల మార్కును దాటి విజయవంతంగా ముందుకు దూసుకుపోతుంది. సెప్టెంబర్ 30న రిలీజ్ అయిన దగ్గర నుండి ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ అయిన ప్రతిచోట, రిలీజ్ అయిన అన్ని భాషల్లో ప్రజలు జేజేలు పలుకుతున్నారు. అంతగా ప్రజల మనసును గెలుచుకున్న ఈ చిత్రం గురించి రామ్ గోపాల్ వర్మ (RGV) ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.

తన ట్విట్టర్ లో తనకు నచ్చిన విషయాలతో పాటు నచ్చిన సినిమాల గురించి రాయడం వర్మకు అలవాటే. ఈ సినిమా గురించి కూడా అలానే పోస్ట్ చేశారు, ” పెద్ద బడ్జెట్ సినిమాలు మాత్రమే ప్రజలను థియేటర్లకి రప్పిస్తాయి అన్న మూఢనమ్మకాన్ని రిషబ్ శెట్టి చేరిపేశారు” అంటూ ట్విట్టర్లో రాశారు.

వర్మ (ram gopal varma) ఈ సినిమా గురించి మరింత రాస్తూ ” ఈ సినిమాలో శివ పాత్ర వేసిన రిషబ్ గులిగ దేవుడిగా మారి ఎలా అయితే గుండెపోటుతో విలన్లు చనిపోయేలా చేసాడో ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఈ 300కోట్ల, నాలుగు వందల కోట్ల, 500కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు తీసేవాళ్లను కూడా రిషబ్ అలానే చేసాడు” అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేసాడు.

” Thanks to the Devil @shetty_rishab ఈ పెద్ద బడ్జెట్ సినిమా వాళ్ళందరికి ఈ కాంతారా సినిమా కలెక్షన్లు అన్ని ఒక పీడకలలా మారి నిద్రలో ఎక్కువగా మేల్కొంటు ఉంటారు. ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలందరూ నీకు(రిషబ్ శెట్టి) ట్యూషన్ ఫీజ్ కట్టాలి” అంటూ తన పోస్ట్ సారాంశాన్ని ముగించారు.

గత శుక్రవారం ప్రభాస్ (prabhas) కూడా తన ఇన్స్టాగ్రామ్ లో ఈ సినిమా సంగతులను తన ఫాలోవర్స్ తో పంచుకున్నారు. తాను ఇప్పటికే రెండుసార్లు ఈ సినిమా థియేటర్ లో చూశానని చెప్పారు.

అంతకుముందే తమిళ సూపర్ స్టార్ ధనుష్ (dhanush) కూడా ఈ సినిమాను ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. తన ట్విట్టర్ లో ఇలాగే హద్దులు చెరిపేస్తూ మంచి సినిమాలు తియ్యండి అంటూ రిషబ్ శెట్టి తో పాటు సినిమా యూనిట్ మొత్తాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చూడండి : 

వయస్సు తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే..

పిల్లల్లో జ్వరానికి భయపడద్దు.. ఇలా చేయండి..

సాయంత్రం ఆరు దాటాక చేయకూడని పనులు

Exit mobile version