HomecinemaPrabhas - RGV: ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించే న్యూస్.. ప్ర‌భాస్ చిత్రంలో రామ్ గోపాల్ వ‌ర్మ‌

Prabhas – RGV: ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించే న్యూస్.. ప్ర‌భాస్ చిత్రంలో రామ్ గోపాల్ వ‌ర్మ‌

Telugu Flash News

Prabhas – RGV : ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్ ఒర‌వ‌డి కాస్త మారింది. ఎంత పెద్ద హీరో అయిన వారి చిత్రంలో ఎవ‌రో ఒక‌రు కీల‌క పాత్ర‌లో క‌నిపించి సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ప్రభాస్ నటిస్తున్న రాజా డీలక్స్ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడ‌నే వార్త ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న‌ ఈ సినిమా హర్రర్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతుంది.

Prabhas : ప్రాజెక్ట్ కె క్రేజీ అప్డేట్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలే

ఇక ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ ఒక చిన్న పాత్రలో కనిపిస్తాడని సమాచారం. ఈ సినిమాకి సంబంధించి ఈ మధ్యనే అన్నపూర్ణ స్టూడియోలో ఒక సెట్ వేసినట్టు.. కీలక ఆర్టిస్టులతో పాటు వర్మ పాల్గొన్న ఒక సీన్స్ ను దర్శకుడు మారుతి చిత్రీకరించారని ప్ర‌స్తుతం ప్ర‌చారం న‌డుస్తుంది. మ‌రి ఇందులో నిజ‌మెంత ఉందో తెలియాల్సి ఉంది. అభిమానులైతే వర్మ కోసం డిజైన్ చేసే పాత్ర ఏముంటుందనే ఆలోచనలో మునిగి తేలుతున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News