Rewind 2022 : ప్రతి ఏడాది ఎదో ఒక కొత్త కథ పట్టుకుని ప్రేక్షకులను అలరించడానికి కొత్త దర్శకులు వస్తూనే ఉంటారు. అలా వచ్చిన వారు ఆయితే హిట్టో లేదా పట్టో ఏదో ఒకటి బాక్స్ ఆఫీస్ దగ్గర చవి చూసే వెళ్తుంటారు. అలా ఈ సారి ఎవరొచ్చారో… ఎలాంటి సినిమాలతో వచ్చారో…. ఒక సారి చూద్దాం.
సినీ నిర్మాత సత్యనారయణ రెడ్డి తనయుడు వశిష్ట ” ప్రేమలేఖ రాశా” సినిమాతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోగా అది నిరాశ పరిచింది. దాంతో హీరో అవ్వలేనని తెలుసుకున్న ఆయన దర్శకుడిగా మారి ఈ ఏడాది కళ్యాణ్ రామ్ తో టైం ట్రావెల్ యాక్షన్ డ్రామా “బింబిసారా”ను తెరకెక్కించారు. ఆయన ఊహించిన విధంగానే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో సినీ పరిశ్రమలో తొలి సారిగా విజయం రుచి చూసిన వశిష్ట కళ్యాణ్ రామ్ తో “బింబిసార 2” తెరకెక్కించడానికి సిద్దం అవుతున్నాడు.
ఈ ఏడాది సిద్దు జొన్నలగడ్డ కు “డీ.జే టిల్లు” సినిమాతో ఎవరూ ఊహించని రీతిలో మంచి విజయం అందుకుంది కూడా ఒక కొత్త దర్శకుడే. విమల్ కృష్ణ అనే నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు.
కాకపోతే ఆశ్చర్య పరిచే విషయం ఏంటంటే “డీ.జే టిల్లు” కి సీక్వెల్ గా మరో సినిమా రాబోతుండగా కొన్ని కారణాల వల్ల ఈ సీక్వెల్ కి విమల్ కృష్ణ దర్శకత్వం వహించబోవట్లేదట.
ఇక “స్వాతిముత్యం” సినిమాతో లక్ష్మణ్ కె.కృష్ణ అనే మరో నూతన దర్శకుడు పరిచయం అయ్యి పర్లేదని పించుకోగా, కొత్తగా వచ్చిన దర్శకులు సాయికిరణ్, హరి- హరీష్ లు “మసూద”, సమంత సినిమా “యశోద” లతో ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ప్రేక్షకులపై మంచి ప్రభావాన్నే ఏర్పరిచారు.
రానా ప్రధాన పాత్రలో ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కిన “1945” సినిమాతో తమిళ దర్శకుడు సత్యశివ తెలుగు నాట తొలిసారిగా అడుగుపెట్టాడు. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయినప్పటికీ సినిమాను తెరకెక్కించిన విధానం వల్ల దర్శకుడు సత్యశివ పరిశ్రమ వారి నుంచి,ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు.
అదే విధంగా తొలి సారిగా “సెహరి”, మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ “సూపర్ మచ్చీ” సినిమాలతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టి దర్శకులు పులి వాసు,జ్ఞాన సాగర్ పర్లేదని పించుకున్నారు.
ఇక చెప్పుకుంటూ పోతే వరుణ్ తేజ్ “గని” తో కిరణ్ కొర్రపాటి,”సమ్మతమే”తో గోపీనాథ్,”ఒకే ఒక్క జీవితం” తో శ్రీ కార్తిక్,”ఓరి దేవుడా”తో అస్వత్ మారి ముత్తు,”ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం”తో ఎ.అర్ మోహన్ ఇలా చాలా మందే ఉన్నారు.
మరిన్ని వార్తలు చదవండి :
తెలంగాణ వార్తలు | జాతీయ వార్తలు | సినిమా వార్తలు | అంతర్జాతీయ వార్తలు | ఆరోగ్య చిట్కాలు