HomecinemaRewind 2022 : ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ ముందు తళతళ లాడిన తారలు

Rewind 2022 : ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ ముందు తళతళ లాడిన తారలు

Telugu Flash News

Rewind 2022 : ఈ ఏడాదిలో ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చినా సరే పాత హీరోయిన్లు మాత్రం వాళ్ళ జోరు తగ్గించలేదు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా వారి సినిమాలను బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకుని హిట్టో, ఫట్టో ఏదో ఒకటి చవి చూసే ఈ ఏడాదిని ముగించుకున్నారు.

రష్మిక మందన

“పుష్ప” విజయంతో ఈ ఏడాదిలోకి అడుగుపెట్టిన రష్మిక,ఈ ఏడాది మొత్తంలో మూడు సినిమాలతో వెండి తెరపైకి వచ్చింది.”ఆడాళ్ళు మీకు జోహార్లు” సినిమాతో నిరుస్తాహ పరిచిన ఆమె దుల్కర్ సల్మాన్ “సీతా రామం”, బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ “గుడ్ బై” సినిమాలలో ముఖ్య పాత్రల్లో కనిపించి ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. వచ్చే ఏడాదిలో కూడా “పుష్ప 2”, బాలీవుడ్ “యానిమల్”,”మిస్టర్ మజ్ను” సినిమాలతో తన వంతుగా వచ్చి విజయాలు సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది మన నేషనల్ క్రష్ రష్మీక మందన.

సమంత

పుష్కర కాలం పూర్తి చేసుకున్న సమంత ఈ ఏడాది మొదట్లో నయనతార ,విజయ్ సేతుపతిలతో “కణ్మణి రాంబో ఖతీజా” సినిమాలో కనిపించి తన వంతు నటనతో ప్రేక్షకులను అలరించినప్పటికీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు నిలువ లేకపోయింది.అయినా సరే ఓటమికి లొంగని సమంత ఈ ఏడాది చివరిలో విడుదలైన “యశోదా” సినిమాతో ఒక హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వచ్చే ఏడాది విడుదల కాబోతున్న “శాకుంతలం” సినిమాకి మరింత విశ్వాసంతో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి రాబోతోంది.

నయన తార

ఇక సమంతతో “కణ్మణి రాంబో ఖతీజా” లో కనిపించి తన నటనతో మెప్పించిన నయన తార ఆ తరువాత వచ్చిన “ఓ 2” ప్రయత్నాత్మక సినిమాతో వచ్చి పర్లేధని పించుకుంది. మెగాస్టార్ చిరంజీవి “గాడ్ ఫాదర్” సినిమాలో కనిపించి మార్కులు కొట్టేసింది.”గాడ్ ఫాదర్” ఇచ్చిన కిక్కుతో ఈ ఏడాది చివర్లో “కనెక్ట్” సినిమాతో మరో సారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన నయన్ అందరికీ బానే కనెక్ట్ అయ్యి విజయాన్ని అందుకుంది.

కీర్తి సురేష్

ఇక మహానటి సినిమా తరువాత చెప్పుకో దగ్గ విజయాలు లేక సతమతమవుతున్న కీర్తి సురేష్ “గుడ్ లక్ సఖి”,”సర్కారీ వారి పాట” సినిమాలతో అంతంత మాత్రం గానే మెప్పించి పర్లేదనిపించు కోగా, తన ఆశలన్నీ వచ్చే ఏడాదిలో రాబోతున్న నాని “దసరా”,మెగా స్టార్ చిరంజీవి “భోళాశంకర్‌” సినిమాలపైనే పెట్టుకుంది.

also read news: 

-Advertisement-

Ind vs Ban: గ్రేట్ మ్యాచ్.. గ‌ట్టి పోటి ఇచ్చిన బంగ్లా.. పోరాడి గెలిచిన భార‌త్

Green foods: శరీరంలో కొవ్వును కరిగించేందుకు ఈ గ్రీన్‌ ఫుడ్స్‌ ట్రై చేయండి.. వేగంగా ఫలితాలు!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News