Telugu Flash News

Bigg Boss Telugu 6 : క్లోజ్ ఫ్రెండ్స్ మ‌ధ్య అగ్గి రాజేసిన నాగార్జున‌.. ఊగిపోతున్న రేవంత్

Bigg Boss Telugu 6 : బిగ్ బాస్ సీజ‌న్ 6 కార్య‌క్ర‌మం చివ‌రి ద‌శ‌కు చేరుకుంటున్న నేప‌థ్యంలో గ‌త కొద్ది రోజులుగా వెరైటీ టాస్క్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు బిగ్ బాస్. హౌజ్‌మేట్స్ కూడా ఇక ఒక వారం మాత్ర‌మే హౌజ్‌లో ఉంటారు కాబ‌ట్టి వాళ్లు కూడా చాలా ఎఫ‌ర్ట్ పెట్టి ఆడుతున్నారు.ప్ర‌స్తుతం హౌజ్‌లో రేవంత్, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్, శ్రీసత్య, శ్రీహాన్, ఇనయా ఉన్నారు. వీరిలో ఇద్దరు ఎలిమినేట్ కానుండ‌గా, మిగతా ఐదుగురు ఫైనల్ కి వెళతారు. అయితే ఆ ఇద్ద‌రిని ఆదివారం ఎపిసోడ్‌లో ఎలిమినేట్ చేస్తారా లేదంటూ ఇంకేమైన ట్విస్ట్‌లు ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.

అయితే శ‌ని ,ఆదివారాల‌లో హౌజ్‌మేట్స్‌తో నాగ్ చేసే సంద‌డి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.తాజా ఎపిసోడ్‌లో ఫుల్ ఫ‌న్ అందించారు. క‌న్ఫెషన్ రూమ్ లో హారర్ సెటప్ వేసి, చిమ్మ చీకటి చేసి… భయం గొలిపే ఎఫెక్ట్స్ తో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని భయపెట్టిన విష‌యం తెలిసిందే. అయితే ఆదిరెడ్డి, శ్రీస‌త్య‌, శ్రీహాన‌, ఇన‌య ఎక్కువ‌గా భయపడ‌గా, వారి వీడియోలు నాగార్జున ప్రదర్శించారు. ఆదిరెడ్డి, శ్రీసత్య కన్ఫెషన్ రూమ్ వీడియోలు బాగా నవ్వు తెప్పించాయి. వినోదం అనంతరం నాగార్జున కంటెస్టెంట్స్ మధ్య చిచ్చుపెట్టాడు. ఇద్దరి చొప్పున పిలుస్తూ… తాము ఎందుకు బెస్ట్ అవతలి కంటెస్టెంట్ ఎందుకు వరస్ట్, జనాలు మీకు ఎందుకు ఓట్లు వేయాలో చెప్పాలని నాగ్ పేర్కోన్నాడు.

ఇందులో భాగంగా రేవంత్-శ్రీహాన్ లని పిలిచి…. రేవంత్ కి కాకుండా ప్రేక్షకులు నీకెందుకు ఓట్లు వేయాలో చెప్పాలని శ్రీహాన్ ని ఆదేశించడంతో శ్రీహాన్ మాట్లాడుతూ.. ప్రతి కంటెస్టెంట్స్ లో కొన్ని లోపాలు ఉంటాయి. అయితే అవి ఒప్పుకునే ధైర్యం కూడా ఉండాలి. తప్పుని అంగీకరించే గుణం రేవంత్ లో లేదు. కాబట్టి ఆడియన్స్ రేవంత్ కంటే నాకు ఎక్కువగా ఓట్లు వేయాలని శ్రీహాన్ సమర్ధించుకోవ‌డంతో రేవంత్ మొహం మాడిపోయింది. కోపంలో ఉన్న రేవంత్ ని నాగార్జున మరింత రెచ్చగొట్టాడు. నిన్ను మాటలు మార్చేవాడని శ్రీహాన్ ఆదిరెడ్డితో చెప్పాడని నాగార్జున అన‌డంతో…. శ్రీహాన్ వెనుక మాట్లాడతాడని నాకు తెలుస‌ని రేవంత్ అన్నాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న ఫ్రెండ్షిప్‌కి బీట‌లు వారిన‌ట్టే అయింది.

also read news:

Ananya Panday latest hot instagram photos 2022

bhumi pednekar latest instagram photos 2022

Exit mobile version