Homebigg boss telugu season 6Bigg Boss 6: శ్రీ సత్యపై రేవంత్ ఫైర్.. శాడిజం నేను కూడా చూపిస్తా అంటూ సీరియ‌స్!

Bigg Boss 6: శ్రీ సత్యపై రేవంత్ ఫైర్.. శాడిజం నేను కూడా చూపిస్తా అంటూ సీరియ‌స్!

Telugu Flash News

Bigg Boss 6:  బిగ్ బాస్ సీజ‌న్6 కార్క‌క్ర‌మం 13వ వారంలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. గేమ్ లాస్ట్‌కి రావ‌డంతో హౌజ్‌మేట్స్ ప్ర‌తి టాస్క్ లో శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు. బిగ్ బాస్ కూడా ఆస‌క్తిక‌ర‌మైన టాస్క్‌లు ఇస్తూ షోని మ‌రింత ర‌క్తి క‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ షోలో టికెట్ టు ఫినాలే టాస్క్ జోరుగా సాగుతోంది. తాజా ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు వరుసగా టికెట్ టు ఫినాలే టాస్క్ లు ఇవ్వ‌గా, ఇందులో ఒక్కో టాస్క్ వైవిధ్యంగా ఉంటూ ఆసక్తిని రేకెత్తించింది. అయితే టికెట్ టూ ఫినాలే టాస్క్‌లో మ‌ధ్య‌లో బ‌య‌ట‌కు వ‌చ్చిన ఇన‌య‌కు బిగ్ బాస్ మ‌రో అవ‌కాశం ఇవ్వ‌గా ఆమె వినియోగించుకోలేక‌పోయింది. కాని కీర్తి ఛాన్స్ అందుకొని విజయం సాధించింది.

ఆ తర్వాత బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే పోటీలో పాల్గొనే సభ్యులకు .. జండాలు జగడం అనే టాస్క్ ఇవ్వ‌గా, ఇందులో భాగంగా హౌజ్‌మేట్స్ అడ్డంకులు దాటుకుంటూ బాల్స్ ని బాస్కెట్ లో వేయాలి. ముందుగా బాస్కెట్ లో బాల్ వేసిన వారికీ జెండాని మొదటి స్థానంలో ఉంచే అవకాశం ఉంటుంది. తద్వారా టికెట్ టు ఫినాలే రేసులో వారు ముందు ఉంటారు అని బిగ్ బాస్ చెప్పారు. ఈ టాస్క్ లో వరుసగా రేవంత్, ఆదిరెడ్డి, ఫైమా, శ్రీహన్, కీర్తి జెండాలని పాతారు. ఇక మరో టాస్క్ లో భాగంగా ఇంటిసభ్యులే ఏకాభిప్రాయంతో టికెట్ టు ఫినాలే కి ఎవరు అర్హులే తేల్చాలి అని చెప్ప‌డంతో హౌజ్‌మేట్స్ అంతా అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

కీలక‌మైన టాస్క్‌లలో కూడా ఏకాభిప్రాయం ఏంటి బిగ్ బాస్ అంటూ వారు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. మ‌రో టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు ప్లేట్ లు, కప్పులు, సాసర్ లని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. అలా చివరి వరకు బ్యాలెన్స్ చేసిన వారు విజేతలు. ముందుగా ఫైమా ఈ టాస్క్ నుంచి అవుట్ కాగా, ఆదిరెడ్డి విజేతగా నిలిచారు. ఈ టాస్క్ బాగా కష్టంగా ఉండడంతో రేవంత్ అసహనం వ్యక్తం చేస్తూ… సంచాలక్ గా వ్యవహరిస్తున్న శ్రీ సత్యపై రేవంత్ ఫైర్ అయ్యాడు. శాడిజం నేను కూడా చూపిస్తా అంటూ సీరియ‌స్ అయ్యాడు. మ‌రి ఈ రోజు ఎలాంటి ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు జ‌ర‌గుతాయో చూడాలి.

also read news:

horoscope : 01-12-2022 గురువారం రాశి ఫలాలు చూడండి

చలికాలంలో వేడి వేడి సోయా మసాలా పకోడీ రెడీ

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News