Telugu Flash News

Bigg Boss 6: నేనేంటో గీతూకి చూపిస్తానంటూ శ‌ప‌థం చేసిన రేవంత్‌…!

bigg boss telugu 6

Bigg Boss 6: బిగ్ బాస్ సీజ‌న్ 6 కార్య‌క్ర‌మంలో హౌజ్‌మేట్స్ మ‌ధ్య వాడివేడి చ‌ర్చ న‌డుస్తుంది. మొన్న‌టివ‌ర‌కు మిత్రులుగా ఉన్న‌వారు కూడా ఇప్పుడు శ‌త్రువులు అవ‌తున్నారు.

రెండు రోజులుగా చేప‌ల టాస్క్ జ‌ర‌గ‌గా, ఈ టాస్క్‌లో విజయం సాధించిన శ్రీహాన్, శ్రీసత్య నేరుగా కెప్టెన్సీ పోటీకి అర్హత సాధించిన విష‌యం తెలిసిందే. మిగిలిన జంటలలో సూర్య, రేవంత్, కీర్తి, ఫైమా కెప్టెన్సీ పోటీకి అర్హత సాధించ‌గా, గేమ్ బాగా ఆడిన రేవంత్‌ని గీతూ వెన్నుపోటు పొడిచిన కార‌ణంగా రేవంత్ ఊగిపొయాడు.

నేనేంటో చూపిస్తానంటూ శ‌ప‌థం కూడా చేశాడు. అయితే కెప్టెన్సీ టాస్క్‌లో మొదటి రౌండ్ కి వాసంతి సంచలకురాలిగా వ్యవహరించింది.

కెప్టెన్సీ ఫైట్..

ఇందులో భాగంగా కెప్టెన్సీకి అర్హత సాధించిన వారందరికీ నడుముకి తాడులు కట్టగా,. అవన్నీ చిక్కుముడుల‌తో ఉన్నాయి. ఆ చిక్కు ముడులు విప్పుకుని గంట మోగించిన మొదటి ముగ్గురు సభ్యులు రెండవ రౌండ్ కి అర్హులు అవుతారు.

ఈ టాస్క్ లో కీర్తి, సూర్య, శ్రీహన్ విజయం అందించి రెండవ రౌండ్ కి వెళ్లారు. రెండవ రౌండ్ లో ఈ ముగ్గురు ఆంగ్ల సి అక్షరం ఉన్న పెద్ద వెస్ట్ ధరించాలి. మిగిలిన సభ్యులకు తాము కెప్టెన్సీకి ఎందుకు అర్హులమో వివరించాలి. మిగ‌తా కంటెస్టెంట్స్ ఎవ‌రు కెప్టెన్సీకి అర్హులు కాదు అనుకున్నారో వారిని క‌త్తితో పొడుస్తారు.

ఎపిసోడ్ ముగిసే సమయానికి సూర్య అత్యధికంగా మూడు కత్తి పోట్లకి గురవుతాడు. కీర్తికి 2, శ్రీహన్ కి ఒక కత్తి పోటు వస్తుంది. శ్రీహన్ కి కత్తి పోటు ఇనయ వేస్తుంది.

శ్రీహన్ మంచి వాడు అంటూనే అతడికి స్థిరత్వం లేదని ఇనయ ఆ కత్తి పోటు పొడ‌వడం విశేషం. ఇనయ ప్రవర్తన శ్రీహన్ కి కోపం తెప్పించింది. మంచిగా ఉంటూనే ఇలా చేస్తుంది.

నిజంగా ఊస‌ర‌వెల్లిలా ప్ర‌వ‌ర్తిస్తుంది అంటూ శ్రీహాన్ త‌న ఆగ్ర‌హాన్ని వ్య‌క్త‌ప‌రుస్తాడు. వారానికి ఒకరితో ఉంటుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మొత్తానికి కెప్టెన్సీ టాస్క్ రౌండ్ 2 విజేత ఎవరో స‌స్పెన్స్‌లో పెట్టిన బిగ్ బాస్ నేడు తేల్చ‌నున్నారు.

ఇవి కూడా చదవండి : 

horoscope today : 28-10-2022 శుక్రవారం ఈ రోజు రాశి ఫలాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోండి ..ఈ చిట్కాలు పాటిస్తే చాలు!

Exit mobile version