Homebigg boss telugu season 6Bigg Boss 6: షాకింగ్ వార్త‌తో ఎపిసోడ్ ప్రారంభం.. బ‌రువైన హృద‌యంతో నివాళులు అర్పించిన కంటెస్టెంట్స్

Bigg Boss 6: షాకింగ్ వార్త‌తో ఎపిసోడ్ ప్రారంభం.. బ‌రువైన హృద‌యంతో నివాళులు అర్పించిన కంటెస్టెంట్స్

Telugu Flash News

Bigg Boss 6: గురువారం నాటి 75వ ఎపిసోడ్‌లో రేవంత్ బిగ్ బాస్ హౌజ్‌కి మరోసారి కెప్టెన్ అయ్యాడు. ఈవారం కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచిన ఇనయ, శ్రీహాన్, రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్‌లకు బాల్ & గోల్ అనే ఫిజికల్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో నలుగురు మగాళ్లతో ఇనయ పోటీపడి చివరి వరకూ ఒంటరిగా పోరాటం చేసింది.

మొదట్లో రోహిత్‌ని ఆదిరెడ్డి తెలివిగా మట్టికరిపించిన‌, ఆ తరువాత ఈ ఆట తేలేది లేదని.. బిగ్ బాస్ ఏకాభిప్రాయం నిర్ణయంతో ఆదిరెడ్డిని ఆట నుంచి తప్పించేలా చేశాడు. మొదటి నుంచి శ్రీహాన్, రేవంత్‌లు కలిసి గేమ్ ఆడిన విష‌య తెలిసిందే. వాళ్లిద్దరూ కలిసి ఆదిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించడంతో అతను గేమ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ఇక ఇనయ కైడా పోటీ నుంచి తప్పుకుంటారు. చివరకి పోటీలో రేవంత్, శ్రీహన్ మాత్రమే ఉండ‌గా, రేవంత్ తన బలం మొత్తం ప్రయోగించి శ్రీహన్ ని నెట్టివేస్తూ గోల్ వేస్తాడు. దీనితో శ్రీహన్ అవుట్ అయి రేవంత్ విన్న‌ర్‌గా నిలుస్తాడు.

బిగ్ బాస్ రేవంత్ ని ఇంటికి కొత్త కెప్టెన్ గా ప్రకటించి అభినందిస్తారు. గేమ్ చాలా మజా ఇస్తోంది అంటూ బయట ఉన్న రాజ్ ఎంజాయ్ చేశాడు. ఇక ఈ గేమ్ కి ఫైమా సంచాలక్ గా వ్యవహరించింది. ఆమె తర్వాత అవుట్ అయిన సభ్యులు సంచాలక్ పాత్ర నిర్వహిస్తారు.

బిగ్ బాస్ భూమిని టచ్ చేస్తూ బాల్ కోర్టు లోపలికి వెళ్లాలని చెబితే .. రేవంత్‌తో మూర్ఖంగా వాదించాడు. శ్రీహాన్, శ్రీసత్యలతో కలసి ఇతను గేమ్ ఆడొచ్చు కానీ.. ఫైమా ఏదో సైగ చేసినందుకు మాత్రం ఇతను తెగ ఫీల్ అయిపోయాడు. వేరే వాళ్లని సేఫ్ గేమ్ అన్నప్పుడు నువ్వు ఇప్పుడు చేసేది ఏంట్రా బాబూ అని ఫైమా అడిగితే.. నేను సేఫ్ గేమ్ కాదని వాదించాడు రేవంత్.

రేవంత్ మాత్రం ఇందులో పరమ చెత్తగా గేమ్ ఆడాడు. ఎంతమందితో కలిసి ఆడతావ్ అని ఆదిరెడ్డి గట్టిగా ఆడిగేసరికి కాస్త‌ తోక ముడిచాడు రేవంత్. ఏదైతేనేం ఎట్ట‌కేల‌కు మ‌ళ్లీ కెప్టెన్ అయ్యాడు. ఇక ఈ ఎసిసోడ్ షాకింగ్ న్యూస్ తో ప్రారంభం అయింది. సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించిన విషయాన్ని బిగ్ బాస్ బరువైన మనసుతో ఇంటి సభ్యులకు తెలియజేయ‌గా, ఈ వార్త విన్న బిగ్ బాస్ సభ్యులంతా షాక్ కి గురవుతూ విషాదంలో ఉండిపోయారు. ఆ తర్వాత కృష్ణకి నివాళులు అర్పిస్తూ కాసేపు మౌనం పాటించారు.

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News