Telugu Flash News

Chicken Curry: హోటల్‌ ఫ్లేవర్‌తో చికెన్‌ కర్రీ ఇలా తయారు చేసుకోండి..

Chicken Curry: చికెన్ అంటే నాన్‌వెజ్‌ ప్రియులకు మహా ఇష్టంగా తింటుంటారు. చికెన్‌లో రకరకాల వెరైటీలు చేసుకొని తింటూ ఉంటారు. చికెన్‌ కర్రీ, చికెన్‌ ఫ్రై, తందూరీ చికెన్, బిర్యానీ, కబాబ్స్, బట్టర్‌ చికెన్.. ఇలా అనేక రకాలుగా చేసుకోవచ్చు. అయితే ఎన్ని రకాలుగా చేసుకున్నా కూడా చికెన్‌ కర్రీ రుచి వేరేలా ఉంటుంది. కొన్ని రెస్టారెంట్లలో ఫ్లేవర్‌ మహా ఇష్టంగా కస్టమర్లు తింటుంటారు. హోలట్‌ ఫ్లేవర్‌తో చికెన్‌ కర్రీ ఎలా చేయాలో ఓ లుక్కేయండి..

ఇందుకు కావాల్సిన పదార్ధాలు.. చికెన్ – కిలో. రెండు త‌రిగిన ఉల్లిపాయ‌లు, ఏడు ఎండు మిర్చి, రెండు రెమ్మలు క‌రివేపాకు, త‌రిగిన కొత్తిమీర, ఓ టేబుల్‌ స్పూన్ ధ‌నియాలు, అర టీస్పూన్ జీల‌క‌ర్ర, రెండు ల‌వంగాలు, రెండు యాల‌కులు, కొద్దిగా దాల్చిన చెక్క, తగినంత అల్లం వెల్లులి పేస్ట్, టీ స్పూన్‌ కారం, అర టీస్పూన్ ప‌సుపు, రుచికి సరిపడా సాల్ట్‌, ఓ టేబుల్‌ స్పూన్‌ పెరుగు, తగినంత నూనె, ఓ నిమ్మకాయ.

ఇక ముందుగా చికెన్‌ను క్లీన్‌ చేసుకొని నీరు లేకుండా ఓ గిన్నెలో వేయాలి. అనంతరం పెరుగు, కారం, ఉప్పు, నిమ్మరసం కలిపి మాగ్నెట్‌ చేసి పక్కన పెట్టాలి. తర్వాత చికెన్‌ మసాలా సిద్ధం చేయాలి. పొయ్యి మీద బాణలి పెట్టి ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, దాల్చిన చెక్క, లంగాలు, యాలకులు వేసి నూనె లేకుండా వేయించాలి. తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్‌ చేయాలి. అనంతరం ఓ గిన్నె స్టవ్‌ మీద పెట్టుకొని నూనె వేడి అయ్యాక అందులో నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేయాలి. అనంతరం నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని వేయించాలి.

ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి.. పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. తర్వాత పసుపు వేసుకుని ముందుగా మాగ్నెట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకుని బాగా ఉడికే దాకా చూసుకోవాలి. చికెన్ ఉడికిన అనంతరం కారం యాడ్‌ చేసుకోవాలి. తర్వాత కొన్ని నిమిషాల పాటు ఉడికేలా చూసుకోవాలి. తగినంత మసాలా, వేసుకుని నూనె తేలేవరకూ స్విమ్ లో పెట్టుకోవాలి. చికెన్ లో తరిగిన కొత్తిమీరను వేసుకుని మంట ఆఫ్‌ చేయాలి. అంతే… వేడి వేడిగా చాలా టేస్టీగా ఉండే చికెన్‌ కర్రీ సిద్ధమైపోతుంది. ఇలా అన్నంలో, చపాతీలో, పూరీలో, పుల్కాలో కలుపుకొని తినేయొచ్చు.

Read Also : Recipe: మునగాకు, కందిపప్పు రెసిపీ.. ఇలా ట్రై చేయండి

Exit mobile version