Homehealthబరువు తగ్గడానికి సహాయపడే 9 ఆరోగ్యకరమైన ప్రోటీన్ స్నాక్స్..

బరువు తగ్గడానికి సహాయపడే 9 ఆరోగ్యకరమైన ప్రోటీన్ స్నాక్స్..

Telugu Flash News

చిరుతిండి బరువు పెరగడానికి ప్రధాన కారణాలలో ఒకటి. అది మన శరీరంలోని అనవసర కొవ్వుని పెంచే ప్రమాదం ఉంది. చిరుతిండిని పూర్తిగా మానేయడమే దీనికి పరిష్కారం కాదు మీరు చేయాల్సిందల్లా అనారోగ్యరమైన చిరుతిండిని ఆరోగ్యకరమైన ప్రోటీన్ స్నాక్స్‌తో భర్తీ చేయడమే దీనికి అసలైన పరిష్కారం.

డైటీషియన్/న్యూట్రిషనిస్ట్ కన్సల్టెంట్ దివ్య గోపాల్‌ మాట్లాడుతూ, “ప్రజలు తరచుగా వెంటనే అందుబాటులో ఉండే స్నాక్ ఫుడ్‌ల వైపు మొగ్గు చూపుతారు. వీటిలో సాధారణంగా చక్కెర మరియు శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్‌లు అధికంగా ఉంటాయి, ఒకవేళ బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, ఈ ప్రోటీన్ ఆహారం రక్షణగా ఉంటుంది. ప్రోటీన్ కండరాల నిర్మాణంలో సహాయపడుతుంది మరియు తిన్న తర్వాత కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది”

బరువు తగ్గడానికి సహాయపడే 9 ఆరోగ్యకరమైన ప్రోటీన్ స్నాక్స్ ఇక్కడ చూడండి:

1. గ్రీక్ యోగర్ట్(Greek Yoghurt)

ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది పోషకమైన ఆహారమే కాదు ,కడుపు నిండిన భావన కలిగిస్తుంది. గుర్తుంచుకోండి, బరువు తగ్గడం మీ లక్ష్యం అయితే సాధారణ పెరుగు కంటే ఈ గ్రీకు యోగర్ట్ మంచిది.

2. కూరగాయలు(vegetables)

కాలీఫ్లవర్, బ్రోకలీ, అవోకాడో, క్యాబేజీ, పాలకూర, మరియు పచ్చి బఠానీలు

కూరగాయలు ఎంత మేలు చేస్తాయో మనందరికీ తెలుసు, దాని నుండి మనం చిరుతిండిని ఎందుకు తయారు చేయకూడదు? మీరు కొన్ని కూరగాయలను ఉడకబెట్టి సలాడ్ తయారు చేయవచ్చు లేదా ఆరోగ్యకరమైన శాండ్‌విచ్ చేయవచ్చు. బరువు తగ్గించే కూరగాయలను ఎంచుకోవడం ముఖ్యం.

-Advertisement-

3. ఉడికించిన గుడ్లు (boiled eggs)

మాంసకృత్తులు మరియు విటమిన్ బి అధికంగా ఉండటం వల్ల గుడ్లు కూడా చిరుతిండిగా తీసుకోవడం మంచిది. గుడ్లు బరువు తగ్గడానికి ఒక మార్గం ఎందుకంటే అవి జీవక్రియ రేటును పెంచుతాయి మరియు కేలరీలను వేగంగా కరిగించడంలో సహాయపడతాయి.

4. వేరుశెనగ వెన్న (peatnut butter)

త్వరగా అయిపోవాలి అనుకుంటే ఈ పీనట్ బటర్ శాండ్‌విచ్ చేసేయచ్చు. ఇందులో ప్రోటీన్‌లో అధికంగా ఉండటమే కాకుండా చాలా రుచికరంగా ఉంటుంది మరియు మీకు త్వరగా ఆకలి వేయదు.

5. బాదం (Almonds)

అల్పాహారం కోసం రుచిగా ఉండటంతో పాటు, బాదంలో ప్రోటీన్, విటమిన్ E, రిబోఫ్లావిన్, ట్రేస్ మినరల్స్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి అనేక ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది జీవక్రియను వేగవంతం చేసే మరియు బరువు తగ్గడంలో సహాయపడే లిపేస్ వంటి కొన్ని ఎంజైమ్‌లను విడుదల చేస్తుంది.

6.వేయించిన సెనగలు

వీటిలో ప్రోటీన్, ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం వంటివి ఉన్నాయి. బరువు తగ్గడం సులభం.

7. పండ్లు

మీరు త్వరగా, రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వాటి కోసం చూస్తున్నప్పుడు పండ్లు మంచి ఛాయిస్. నారింజ, జామ, దానిమ్మ, పుచ్చకాయ, యాపిల్, అరటి మరియు కివీ వంటి పండ్లను తీసుకోండి.

8. కాటేజ్ చీజ్

కాటేజ్ చీజ్ ఆరోగ్యకరమైనది మరియు అధిక ప్రోటీన్ కలది. ఇందులో కాల్షియం కూడా ఉంది, మరియు అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే మన శరీరానికి తగినంత కాల్షియం మరియు ప్రొటీన్లు లభించినప్పుడు, మనం ఆరోగ్యంగా ఉంటామని.

9. చియా సీడ్స్ పుడ్డింగ్

ఈ రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన చిరుతిండి ఒక సూపర్‌ఫుడ్‌గా బరువు తగ్గాలనుకునే వారు చియా సీడ్స్ తింటున్నారు, చియా విత్తనాలలో అధిక ప్రోటీన్ మరియు కాల్కమ్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఫాస్పరస్ మరియు మాంగనీస్ వంటి ఇతర పోషకాల కారణంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

read more news:

Shah Rukh Khan Pathaan telugu teaser – షారూఖ్ ఖాన్ పఠాన్ మూవీ తెలుగు టీజర్

Happy Birthday Shah Rukh Khan : షారూఖ్ ఖాన్ గురించి ఈ 10 ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకు తెలుసా..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News