Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నానని కామెంట్ చేశారు. రేణు దేశాయ్ పోస్ట్ ఒక్కసారిగా కలకలం రేపింది. ”నా సన్నితులకు నా ఆరోగ్య సమస్యల గురించి తెలుసు. కొన్నాళ్లుగా నేను హృదయ, ఇతర సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నాలాగే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లలో మనో ధైర్యం నింపాలని ఈ పోస్ట్ పెడుతున్నాను.
విచారం చెందవద్దు, విశ్వాసం కోల్పోవద్దు. ఈ ప్రపంచం మనకోసం అందమైన ప్రణాళికలు వేసి ఉంటుంది. నవ్వుతూ బ్రతికేయండి. వ్యాధికి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మంచి ఆహారం తీసుకుంటూ యోగా, వ్యాయామం చేస్తున్నాను. ఈ సమస్యను ఎదిరించి త్వరలోనే బయటపడతాను” అని రేణు దేశాయ్ సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు. ఆమెకు వచ్చిన ఇబ్బంది ఏదైనా కానీ, కోలుకొని బయటపడాలని అభిమానులు కోరుకుంటున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు.
also read :
Oversleeping : ఎక్కువ నిద్రపోయినా సమస్యలే.. ఈ జబ్బులు సోకే ప్రమాదం!