ముసలి వయస్సు లో ముఖ్యంగా వేదించే సమస్య కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అయితే.. ఈ రోజుల్లో తినే తిండి వల్ల , 30 ఏళ్లకే ఈ సమస్యలు వస్తున్నాయి. ఇందుకు కారణాలు అనేకం. అయితే మరి ఈ సమస్యలు తగ్గడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- వెల్లుల్లి పాయలను నూరి పట్టువేస్తే కీళ్ళ నొప్పులు తగ్గును.
- అర చెంచా వెల్లుల్లి రసము ఒక చెంచా నిమ్మరసముతో కలుపుకొని త్రాగిన కీళ్ళనొప్పులు తగ్గును.
- గసగసాలు నీళ్ళలో నానబోసి ఆ నీళ్ళు త్రాగుచుండిన కీళ్ళ నొప్పులు నివా రించును.
- గన్నేరు ఆకులు నీళ్ళలో మరగబెట్టి నూనెలో కలిపి రాసిన మోకాళ్ళ నొప్పులు నివారణ అగును.