ఈ రోజుల్లో థైరాయిడ్ (thyroid disease) అనేది ఆరోగ్య సమస్యలలో ఒకటి. షుగర్, బీపీతో పాటు థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు చాలా కాలం పాటు ప్రతిరోజూ మందులు వాడాల్సి ఉంటుంది. ఈ సమస్య చాలా కాలంగా ఉన్నప్పటికీ, ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్య చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ వేధిస్తోంది.
అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ సమస్యలు వస్తాయని మనందరికీ తెలుసు. అయోడైజ్డ్ ఉప్పును ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయోడైజ్డ్ ఉప్పు వాడుతున్నా థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. థైరాయిడ్‌లో హైపర్ థైరాయిడ్ మరియు హైపోథైరాయిడ్ అనే రెండు రకాలు ఉన్నాయి. అయోడిన్ తక్కువగా తీసుకోవడం వల్ల హైపర్ థైరాయిడిజం, అయోడిన్ ఎక్కువగా తీసుకుంటే హైపోథైరాయిడిజం వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
మనలో చాలా మంది హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అయోడైజ్డ్ ఉప్పు ఎక్కువగా వాడడం వల్లనే హైపోథైరాయిడిజం బారిన పడతామని వైద్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో సాధారణ ఉప్పు వాడటం వల్ల థైరాయిడ్ సమస్యలు తక్కువగా ఉండేవని, అయితే అయోడైజ్డ్ ఉప్పు వాడటం ప్రారంభించిన వారు థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారు ఎక్కువగా ఉన్నారని నిపుణులు చెబుతున్నారు.
అయోడైజ్డ్ ఉప్పు వాడకానికి స్వస్తి చెప్పి సరైన ఆహారం తీసుకుంటే జీవితాంతం మందులు వాడకుండా కేవలం మూడు నెలల్లోనే థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. అయోడైజ్డ్ సాల్ట్ వాడటం వల్ల థైరాయిడ్ సమస్య లేనివారిలో కూడా ఇది వస్తుందని నిపుణులు చెబుతున్నారు.