Flax Seeds : కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఆయిల్, జంక్ ఫుడ్‌ను వీలైనంత వరకు పక్కన పెడుతున్నారు. వంటింటి చిట్కాలతో చాలా మంది మేలైన ఆహారపు అలవాట్లు ఒంటపట్టించుకుంటున్నారు.
శరీరంలో కొవ్వు పేరుకుపోయే ఆహార పదార్థాలు తీసుకుంటే చాలా డేంజర్. వీటి వల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వస్తాయి. ఇలాంటి కొవ్వు, చెడు కొలెస్ట్రాల్‌ను పోగొట్టేందుకు కొన్ని రెమెడీస్ ఉన్నాయి.
1. రక్తనాళ్లలో కొవ్వు పేరుకుపోకుండా ఉండటానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉపయోగపడతాయి.
2. అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
3. అవిసె గింజల్లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనే మంచి కొవ్వు కూడా ఉంటుంది. ఇది శరీరానికి మేలు చేస్తుంది.
4. 30 రోజులపాటు రోజు 25 నుంచి 30 గ్రాములు అవిసె గింజల్ని తినడం వల్ల హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ శాతం తగ్గుతుంది.
5. గుండెజబ్బులు వచ్చి స్టంట్స్, బైపాస్ ఆపరేషన్స్ చేయించుకున్నవారు అవిసె గింజల్ని రోజుకు 25 గ్రాములు తీసుకోవాలి.
6. అవిసె గింజలతో లడ్డూలు చేసుకొని తింటే మరింత రుచిగా ఉంటాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని వార్తలు చదవండి :
Megha Akash: హీరోయిన్ మేఘా ఆకాశ్ ఇంట విషాదం.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన అందాల భామ
Manchu Manoj : మంచు మనోజ్ పెళ్లిలో కనిపించిన మోహన్ బాబు..అవన్నీ పుకార్లేనా?