Telugu Flash News

Eggshells : గుడ్డుతో పాటు పెంకులు తిన్నా ఆరోగ్యమే!

Eggshells

Eggshells are edible and are an excellent source of calcium : సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకోవాలంటే రోజూ గుడ్డు తినాలని పోషకాహార నిపుణులు చెబుతారు. సమతుల ఆహారాన్ని అందించడంలో కోడిగుడ్డు పాత్ర విశేషమైనది. గుడ్డులోని తెల్లసొన, పచ్చసొనలో మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. గుడ్లు తింటుంటాం కానీ గుడ్డు పెంకులను ఎవరూ తినరు. అయితే, వాటిని కూడా అప్పుడప్పుడు తినమని నిపుణులు చెబుతున్నారు.
గుడ్డులో ఎన్ని పోషకాలుంటాయో… గుడ్డు పెంకుల్లోనూ అన్ని పోషకాలు ఉంటాయని సూచిస్తున్నారు.

1. గుడ్డు పెంకుల్లో కాల్షియం కార్బోనేట్, ప్రోటీన్లు ఇతర ఖనిజాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.

2. ఒక గుడ్డు పెంకులో సగం తిన్నా కూడా మన శరీరానికి కావలసిన రోజువారీ క్యాల్షియం దొరుకుతుందట.

3. గుడ్డు పెంకులో లభించే కాల్షియం కార్బోనేట్ వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.

4. పెంకులో మెగ్నీషియం, ఫ్లోరైడ్ వంటి ఇతర ఖనిజాలు కూడా ఉంటాయి.

5. ఆస్టియోపోరొసిస్ వంటి ఎముకలను బలహీనపరిచే వ్యాధుల నుంచి గుడ్డు పెంకులు కాపాడతాయని వైద్యులు చెబుతున్నారు.

Also Read :

Shriya Saran You And I Magazine Photoshoot Photos 2023

house arrest : 11 ఏళ్లుగా నరకం.. భార్యను బందీ చేసిన అడ్వొకేట్‌.. విడిపించిన పోలీసులు!

Nagaland: 60 ఏళ్ల చరిత్రలో రికార్డు.. నాగాలాండ్‌లో అసెంబ్లీకి మహిళలు.. 

 

Exit mobile version