Telugu Flash News

Ravi Teja: ర‌వితేజ క‌మ్ బ్యాక్ మాములుగా లేదు.. 2 సినిమాలు 300 కోట్లు

Ravi Teja: మాస్ మ‌హ‌రాజా రవితేజ ఇటీవ‌ల వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బందులు ప‌డుతున్న విష‌యం తెలిసిందే. 2017లో రిలీజైన రాజా ది గ్రేట్ త‌ర్వాత ర‌వితేజ మ‌రో స‌క్సెస్ కోసం దాదాపు ఐదేళ్లు ఎదురుచూడాల్సివ‌చ్చింది.

ట‌చ్ చేసి చూడు, నేల టికెట్‌, అమ‌ర్ అక్బ‌ర్ ఆంథోనీ, డిస్కోరాజా, ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ ఇలా అర‌డ‌జ‌నుకుపైగా ప‌రాజ‌యాల్ని అందుకున్నారు.ఈ క్ర‌మంలోనే త‌న‌కు అచ్చొచ్చిన మాస్ కామెడీ జోన‌ర్‌లోనే ధ‌మాకా సినిమాతో విజ‌యాన్ని అందుకొని త‌న అభిమానుల్ని సంతోష‌ప‌రిచాడు.

ఈ సినిమాకు ముందు ర‌వితేజ న‌టించిన రెండు సినిమాలు ప‌రాజ‌యం పాలు కావ‌డంతో ధ‌మాకా పెద్ద‌గా అంచ‌నాలు లేవు. కాని ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది.

ఇక ధ‌మాకా స‌క్సెస్‌ను వాల్తేర్ వీర‌య్య‌తో కంటిన్యూ చేశాడు ర‌వితేజ‌. చిరంజీవి మ‌రో హీరోగా న‌టించిన ఈ సినిమాలో ఏసీపీ విక్ర‌మ్ సాగ‌ర్ అనే క్యారెక్ట‌ర్‌లో ర‌వితేజ న‌టించి అంద‌ర‌గొట్టాడు.

లాంగ్ గ్యాప్ త‌ర్వాత చిరంజీవి, ర‌వితేజ కాంబినేష‌న్‌లో రూపొందిన ఈసినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. ఇటీవ‌లే రెండు వంద‌ల కోట్ల మైలురాయిని ట‌చ్ చేసింది.

మొత్తానికి ర‌వితేజ న‌టించిన ధ‌మాకా బాక్సాఫీస్ వ‌ద్ద 100 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌గా వాల్తేర్ వీర‌య్య ఇటీవ‌లే 200 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఈ రెండు విజ‌యాల‌తో మ‌ళ్లీ ర‌వితేజ‌ పూర్వ వైభ‌వాన్ని సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి.

also read :

Lawyer : కర్ణాటకలో సంచలనం.. లాయర్‌ పేరుతో అతడు చేసే పనులు చూస్తే విస్తు పోవాల్సిందే!

Pope Francis : స్వలింగ సంపర్కంపై పోప్‌ ఫ్రాన్సిస్‌ కీలక వ్యాఖ్యలు.. నేరం కాదు.. పాపం అంటూ..!

Viral Video Today : రోడ్డుపై బుల్లెట్‌ బండితో ఫీట్లు.. ప్రాణాలతో చెలగాటం.. వైరల్ వీడియో

Exit mobile version