Telugu Flash News

Ravi Teja : రాయలసీమ నేపథ్యంలో రవితేజ యాక్షన్ డ్రామా

Ravi Teja

Ravi Teja

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) తో డాన్ శ్రీను, బలుపు, క్రాక్ వంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన గోపీచంద్ మలినేని మరోసారి కలిసి సినిమా చేయబోతున్నారని తెలిసిందే. ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో రూపొందనుంది. ఈ సినిమాలో రవితేజ డైలాగులు రాయలసీమ మాండలికంలో ఉంటాయని తెలుస్తోంది. రవితేజ డైలాగులు ఈ సినిమాలో కూడా హైలైట్‌గా ఉండబోతున్నాయట. అలాగే ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా బలమైనదిగా ఉంటుందని తెలుస్తోంది.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్‌గా నిర్మించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా యొక్క పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

రవితేజ ఈ మధ్యనే కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగిల్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

 

 

Exit mobile version