Telugu Flash News

Virat Kohli: ఫుల్ ఫామ్‌లో ఉన్న కోహ్లీని జ‌ట్టులో నుండి తొల‌గించాలంటూ ర‌విశాస్త్రి సూచ‌న‌.. అవాక్క‌వుతున్న ఫ్యాన్స్

Virat Kohli: ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బ్యాట్ ప‌ట్టుకొని గ్రౌండ్ లోకి దిగాడంటే కుర్రాళ్ల‌లో వ‌ణుకు పుట్ట‌డం ఖాయం. ఆ మ‌ధ్య ఫామ్ లేమితో స‌త‌మ‌తం అయిన కోహ్లీ ఇటీవ‌ల మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు. వరుస సెంచ‌రీల‌తో అద‌ర‌గొడుతున్నాడు. అయితే విరాట్ కోహ్లీ అత్యధిక స్కోరు 183 పరుగులు. అది కూడా 2012లో పాకిస్తాన్‌పై చేశాడు విరాట్ కోహ్లీ. దీని తర్వాత తాజాగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 166 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో మరో రెండు మూడు ఓవర్లు ఉండి ఉంటే డబుల్ కొట్టేసేవాడే…ఇప్పటిదాకా వన్డేల్లో డబుల్ సెంచరీలు సాధించిన వారంతా ఓపెనర్లుగా వచ్చినవాళ్లే.

విరాట్ కోహ్లీ వన్‌డౌన్ ప్లేయర్ కాగా, డబుల్ సెంచరీ బాదడానికి విరాట్‌కి ఉండే బంతులు, సమయం తక్కువ. అయితే కుర్రాళ్లు ఈజీగా డబుల్ కొట్టేయడంతో ‘కింగ్’ కోహ్లీ కెరీర్‌లో డబుల్ లేకపోతే బాగోదని అంటున్నారు అభిమానులు… ఇక ఇదిలా ఉంటే మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీని జట్టు నుంచి తొలగించాలని టీమిండియా దిగ్గజం, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో చివరి మ్యాచ్ నుంచి కోహ్లీని తప్పించాలని సూచించాడు దాదాపు మూడు సంవత్సరాల తర్వాత కోహ్లీ సెంచరీ చేసి తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్ తోనే సమాధానం ఇచ్చాడు.

వ‌రుస‌ సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ.. రికార్డులు కొల్లగొట్టాడు. మరి ఇలా రాణిస్తున్న విరాట్ కోహ్లీని న్యూజిలాండ్ తో జరిగే మూడో వన్డే నుంచి తొలగించాలని సూచించాడు రవిశాస్త్రి. దానికి ఓ బలమైన కారణాన్ని కూడా వెల్లడించాడు. విరాట్ టెస్టుల్లో మాత్రం ఘోరంగా విఫలం అవుతూ.. వస్తున్నాడు. అతడు టెస్టుల్లో సెంచరీ చేసి రెండు సంవత్సరాలు కావస్తుంది . వ‌చ్చే నెలలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా భారత్ లో పర్యటించనుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ ప్రపంచ టెస్ట్ సిరీస్ ఛాంపియన్ కు కీలకం కానుంది. ఈ నేపథ్యంలోనే విరాట్ ను కివీస్ తో జరిగే చివరి వన్డే నుంచి తప్పించి రంజీల్లో ఆడించాలని రవిశాస్త్రి సూచించాడు. గత కొన్ని నెలల నుంచి టెస్టుల్లో విరాట్ రాణించడం లేదు. దాంతో కీలకమైన ఆసిస్ టెస్ట్ సిరీస్ కు ముందు రంజీ ట్రోఫీలో ఆడితే అతడికి ప్రాక్టీస్ అవుతుందని ఈ సందర్భంగా రవిశాస్త్రి స్ప‌ష్టం చేశాడు.

Exit mobile version