HomecinemaRashmika: ర‌ష్మిక‌.. నీ బాయ్‌ఫ్రెండ్‌ని త‌రిమికొట్టిన‌ట్టే నిన్ను త‌రిమి కొడ‌తాం అంటూ కేఆర్కే ఘాటు వ్యాఖ్య‌లు...!

Rashmika: ర‌ష్మిక‌.. నీ బాయ్‌ఫ్రెండ్‌ని త‌రిమికొట్టిన‌ట్టే నిన్ను త‌రిమి కొడ‌తాం అంటూ కేఆర్కే ఘాటు వ్యాఖ్య‌లు…!

Telugu Flash News

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక ఈ మ‌ధ్య ఎక్కువ‌గా వివాదాల‌తోనే వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. ఈ అమ్మ‌డు చేసే కామెంట్స్, ప్ర‌వ‌ర్తించే తీరు వివాదాస్ప‌దం అవుతుంది. ‘గీతా గోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల తర్వాత ఫ్యాన్స్‌కు నేషనల్ క్రష్‌గా మారిన ర‌ష్మిక‌…అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీతో ఆమె స్టేటస్ ఎక్కడికో వెళ్లిపోయింది. రీసెంట్‌గా దళపతి విజయ్ సరసన ‘వారిసు’ అనే చిత్రం చేయ‌గా, ఈ మూవీ విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. మరోవైపు హిందీలో సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన ‘మిషన్ మజ్ను’ కూడా త్వరలోనే విడుదల కానుంది.

అయితే తాజాగా రష్మికపై బీటౌన్‌లో మూవీ క్రిటిక్‌గా చెప్పుకునే కమల్ ఆర్ ఖాన్ నెగెటివ్ కామెంట్స్ చేశాడు. ‘మేడమ్ రష్మిక మందన జీ.. మా హిందీ ప్రేక్షకులు మీ బాయ్‌ఫ్రెండ్ అనకొండ సినిమా లైగర్‌ను రిజెక్ట్ చేసి అతన్ని బాలీవుడ్ నుంచి ఎలాగైతే తరిమికొట్టారో.. సరిగ్గా నీకు కూడా అలాగే చేయబోతున్నాం. కానీ మిమ్మల్ని భోజ్‌పురి చిత్రాల్లో చూడటం మాకు ఆనందంగా ఉంటుంది’ అని త‌న‌ పోస్టులో పేర్కొన్నాడు. ఈ ట్వీట్పై ఇటు విజ‌య్, అటు ర‌ష్మిక అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కేఆర్‌కేను దేశం నుంచి వెళ్లగొట్టిన తీరుపై గుర్తుచేస్తున్నారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక ప్రేమలో ఉన్నారని కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక మాల్దీవ్స్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ పిక్స్ చూసిన ఫ్యాన్స్.. విజయ్, రష్మిక ఒకేచోట ఉన్నారని వారి మ‌ధ్య ప్రేమ ఉంద‌ని క‌న్‌ఫాం కూడా చేశారు. ఈ విష‌యంపై ఈ ఇద్ద‌రు ఏ మాత్రం స్పందించ‌డం లేదు. రూమర్స్ మాత్రం తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమా త‌ర్వాత ఖుషీ అనే సినిమా చేస్తుండ‌గా, ఈ మూవీ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ర‌ష్మిక నాన్‌స్టాప్ సినిమాల‌తో ర‌చ్చ చేయ‌బోతుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News