HomecinemaRashmika: ఆ ప‌ని నేను ప‌దే ప‌దే చేస్తే బ్యాక్ పెయిన్ రావ‌డం ఖాయం.. ర‌ష్మిక స్ట‌న్నింగ్ కామెంట్స్

Rashmika: ఆ ప‌ని నేను ప‌దే ప‌దే చేస్తే బ్యాక్ పెయిన్ రావ‌డం ఖాయం.. ర‌ష్మిక స్ట‌న్నింగ్ కామెంట్స్

Telugu Flash News

Rashmika: ఛలో సినిమాతో టాలీవుడ్ డెబ్యూ చేసిన ఈ కన్నడ భామ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో దూసుకుపోతుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక కేవ‌లం తెలుగులోనే కాకుండా హిందీ, త‌మిళ భాష‌ల‌లో కూడా వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ అల‌రిస్తుంది.

అయితే పుష్ప సినిమాలో ఈ అమ్మ‌డు సామీ సామీ.. అనే పాట‌కి చేసిన హుక్ స్టెప్.. యూత్ ని విశేషంగా ఆకట్టుకుంది అని చెప్పాలి.

తాజాగా ఓ అభిమాని.. ‘పుష్ప సినిమాలోని సామి పాటకు మీతో కలిసి డ్యాన్స్ చేయాలని ఉంది’ అని ట్విట్ట‌ర్‌లో కోరాడు. దీనికి స్పందించిన ర‌ష్మిక‌… సామీ సామీ పాటకు నేను ఇంకా డ్యాన్స్ చేయలేను.

ఎందుకంటే.. ఇప్పటికే ఎన్నోసార్లు ఆ పాటకు డ్యాన్స్ చేశాను. ఇంకా అలాగే చేసుకుంటూ పోతే.. నాకు వయసు పైబడ్డాక బ్యాక్ పెయిన్ రావడం ప‌క్కా. ప్రతిసారి అదే సాంగ్ కాదు.. ఈసారి ఏదైనా కొత్తగా చేద్దాం” అని చెప్పి ఫ్యాన్ కొంత ఉత్సాహ‌ప‌ర‌చింది ర‌ష్మిక‌.

ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు ‘పుష్ప 2’తో పాటు రణబీర్ కపూర్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో ‘యానిమల్’, నితిన్ తో ఓ చిత్రం చేస్తుంది.

Rashmika Mandanna at Zee Cine Awards 2023 Photos and Videos

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News