HomecinemaRashmika : పుష్ప‌ 2 లో ర‌ష్మిక‌ కి అంత అన్యాయం జ‌ర‌గ‌నుందా?

Rashmika : పుష్ప‌ 2 లో ర‌ష్మిక‌ కి అంత అన్యాయం జ‌ర‌గ‌నుందా?

Telugu Flash News

Rashmika: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పుష్ప చిత్రం ఎంతటి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పుష్పరాజ్‌గా బన్నీ ప్రదర్శించిన నటవిశ్వరూపం, పాటల్లో ఆయన వేసిన స్టెప్పులు, చేసిన ఫైట్లు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరించాయి.

ఇక ఇందులో శ్రీవల్లిగా రష్మికా మందన్న కనబర్చిన నటనా పటిమకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమాతో ఆమె పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయారు. తాజాగా పుష్ప‌2 మూవీకి సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

‘పుష్ప’ రెండో పార్ట్‌లో రష్మికా మందన్న పాత్ర నిడివిని మేకర్స్‌ తగ్గించారట. ‘పుష్ప 2’లో రష్మిక కొన్ని సీన్లలో మాత్రమే ఆమె కనిపిస్తారని సమాచారం. ఆమె పాత్రను మినహాయించి.. సినిమాలోని మిగిలిన ప్రధాన పాత్రలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని సోషల్‌ మీడియాలో కొందరు నెటిజన్స్‌ పోస్టులు పెడుతున్నారు.

తమ ఫేవరెట్‌ హీరోయిన్‌ తెరపై కొద్దిసేపే కనిపిస్తే ఎలా అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మ‌రి ఈ వార్త‌ల‌లో ఎంత నిజం ఉందనేది తెలియ‌దంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

also read :

ఎమ్మెల్సీ కవితను అరెస్ట్‌ చేసే అవకాశాలు? వ్యూహాత్మకంగా సీబీఐ అడుగులు!

-Advertisement-

Womens T20 World Cup 2023 : పాకిస్తాన్‌తో విక్టరీతో భారత్‌ సరికొత్త రికార్డు.. దంచేసిన జెమీమా!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News