Rashmika: గీతా గోవిందం చిత్రంలో నటించి ప్రేక్షకులని ఎంతగానో అలరించిన రష్మిక, విజయ్ దేవరకొండ జంట ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. కొన్నాళ్లుగా వీరిద్దరు కలిసి కెమెరాలకు చిక్కడంతో ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందని జోస్యాలు చెబుతున్నారు. అయితే వారి అనుమాలని రెట్టింపు చేసేలా వీరిద్దరు ఒకే రోజు ఎయిర్ పోర్ట్‌లో కనిపించారు. వెకేషన్‌లో భాగంగా మాల్దీవులకి వెళ్లి ఉంటారని కొందరు చెబుతున్నారు. విజయ్ దేవరకొండ ఎయిర్ పోర్ట్ లో పెట్టుకున్న కళ్లద్దాలు రష్మిక తన మాల్దీవుల వెకేషన్ ధరించి ఫోటోలు షేర్ చేయడంతో వీళ్లిద్దరి బంధం నిజమేనని, ఇప్పుడు ఇలా అడ్డంగా బుక్ అయ్యారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
అనేక అనుమానాలు..
ఇక రష్మిక మాల్దీవులకి వెళ్లినప్పటి నుండి వెరైటీ డ్రెస్సులలో తెగ ఫొటోలు దిగుతూ నానా రచ్చచేస్తుంది. ఈ బ్యూటీ పిక్స్ చూసి కొందరు కుళ్లుకుంటున్నారు కూడా. అయితే టూర్ లో రష్మిక పిక్స్ దించేది విజయ్ దేవరకొండనే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పుడు ఈ విషయంపై అనేక రకాలుగా చర్చలు నడుస్తున్నాయి.ఇక గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండకు లిప్ లాక్ ఇచ్చిన తర్వాతే ఆమె విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందని అందుకే రక్షిత్ శెట్టికీ బ్రేకప్ చెప్పి పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకుందనే ప్రచారాలు కూడా నడిచాయి.
గీతా గోవిందం చిత్రం తర్వాత ఈ ఇద్దరు డియర్ కామ్రేడ్ అనే సినిమాలో కూడా నటించారు. ఈ సినిమాలోను రష్మిక నానా రచ్చ చేసింది. ఈ క్రమంలోనే వీరి లవ్‌కి సంబంధించి ప్రచారాలు నడుస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్వూలో విజయ్ దేవరకొండ నాకు క్లోజ్ గా ఉండే వ్యక్తి. ఎప్పుడూ తోడుగా ఉంటాడు. మా కెరీర్ బిగినింగ్ లో విజయవంతమైన చిత్రాల్లో కలసి నటించాం. మేము నటులం కాబట్టి మాపై ఫోకస్ ఉంటుంది. ఇండస్ట్రీకి సంబందించిన ఏ విషయం అయినా, సలహా అయినా ముందుగా విజయ్ దేవరకొండతో చర్చిస్తాను అంటూ రష్మిక ఆసక్తికర కామెంట్స్ చేసింది.