Rashmika Mandanna : రష్మిక ప్రస్తుతం ఇతర పాన్ ఇండియా హీరోయిన్లతో పోటీ పడుతోంది. రష్మిక చేస్తున్న సినిమాలన్నీ హిట్ అవుతుండటంతో ఆమెకు డిమాండ్ పెరిగింది. ఈ కన్నడ బ్యూటీ కోలీవుడ్, బాలీవుడ్ పై కూడా దృష్టి సారిస్తోంది. ఇదిలా ఉంటే ఆమెకు మరో తెలుగు సినిమాలో ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ భామ అక్కినేని హీరోతో నటించనుంది.
రష్మిక ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప 2’ చిత్రంలో నటిస్తోంది. ఇది తప్ప ఆమె చేతిలో మరో తెలుగు సినిమా లేదు. అయితే బాలీవుడ్‌లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. ఇటీవల విడుదలైన ‘సీతారామం’ సినిమాతో మరో హిట్ కొట్టిన రష్మిక.. తమిళ్ లో విజయ్‌తో ఒక సినిమా చేస్తోంది. మరియు అక్కినేని హీరోతో రష్మిక నటించనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
అక్కినేని హీరో నాగ చైతన్య ఇంకా ఏ తెలుగు సినిమాను కన్ఫర్మ్ చేయలేదు. అయితే త్వరలో సర్కారు పాట సినిమా దర్శకుడు పరశురామ్ తో సినిమా రానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిందని వినికిడి. అయితే చిత్రబృందం మాత్రం రష్మికను హీరోయిన్ గా అనుకుంటున్నారట. కన్ఫర్మ్ అయితే నాగ చైతన్య, రష్మిక కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే అవుతుంది. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
మరిన్ని సినిమా వార్తలు చదవండి:
‘కాఫీ విత్ కరణ్’ షో పై తాప్సీ షాకింగ్ కామెంట్స్
అతన్ని పూర్తిగా అర్థం చేసుకున్నా అందుకే..విజయ్ దేవరకొండ పై సమంత కామెంట్స్
Koffee With Karan : చివరిసారిగా శృంగారంలో ఎప్పుడు పాల్గొన్నావ్..విజయ్ దేవరకొండ షాకింగ్ ఆన్సర్..