HomecinemaRashmika Mandanna : ర‌ష్మిక దూకుడు మాములుగా లేదు.. ఏ మాత్రం త‌గ్గట్లేదుగా..!

Rashmika Mandanna : ర‌ష్మిక దూకుడు మాములుగా లేదు.. ఏ మాత్రం త‌గ్గట్లేదుగా..!

Telugu Flash News

Rashmika Mandanna : సినిమా పరిశ్ర‌మ‌లో రాణించాలంటే అంత ఆషామాషి కాదు. ఒక్క సినిమా ఫ్లాప్ అయిన వెన‌క్కి వెళుతూనే ఉంటారు. క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మందాన మాత్రం హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా దూసుకుపోతుంది.

ఇటీవ‌ల అమ్మ‌డికి వ‌రుస స‌క్సెస్ లు వ‌స్తున్న నేప‌థ్యంలో నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారింది. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ అమ్మడు సౌత్‌లోనే కాదు నార్త్ లోనూ వరుస పెట్టి సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. మ‌రోవైపు ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలోను తెగ ర‌చ్చ చేస్తుంది. గ్లామ‌ర్ మోత కూడా మోగిస్తుంది.

ర‌ష్మిక కు వ‌రుస ఆఫ‌ర్స్..

ఇప్పుడు ర‌ష్మిక న‌టిస్తున్న సినిమాల విష‌యానికి వ‌స్తే.. హిందీలో ‘మిషన్ మజ్ను’ ‘గుడ్ బై’ ‘యానిమల్’ చిత్రాలు చేస్తోంది. తమిళంలో విజయ్ దళపతికి జోడీగా ‘వారసుడు’ మూవీ చేస్తోంది.

ఇక ఇవే కాకుండా ర‌ష్మిక‌కి త‌మిళ సినిమా ఆఫ‌ర్ కూడా వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. కార్తీ.. రాజు మురుగన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఎస్ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘జపాన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉండ‌గా, అక్టోబర్ ఆఖరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ర‌ష్మిక‌ని ఫైన‌ల్ చేసిన‌ట్టు స‌మాచారం.

కార్తీ హీరోగా తెరకెక్కిన ‘సుల్తాన్’ మూవీతోనే రష్మిక కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా దారుణంగా ఫ్లాఫ్ కావ‌డం, ర‌ష్మిక ట్రోలర్స్ బారిన ప‌డ‌డం జ‌రిగింది. అయితే ఇప్పుడు సుల్తాన్ వంటి ఫ్లాప్ తర్వాత కూడా కార్తీ మళ్లీ రష్మికకు ఛాన్స్ ఇవ్వ‌డం విశేషం. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న అయితే రానుంది. ఇక ర‌ష్మిక సోష‌ల్ మీడియాలో ఎద అందాలు చూపిస్తూ గ్లామ‌ర్ మోత మోగించ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News