Shubman Gill: టీమ్ ఇండియా క్రికెటర్లు, నటీమణులతో ప్రేమాయణం నడపడం ఎప్పటి నుండో జరుగుతుంది. కొన్ని ప్రేమ వరకు ఆగిపోగా, మరి కొన్ని పెళ్లి వరకు కూడా వెళ్లాయి. కోహ్లీ-అనుష్క, హార్థిక్ పాండ్య-నటాసా స్టాంకోవిచ్, కె.ఎల్ రాహుల్-అతియా శెట్టి అంతకముందు పలువురు క్రికెటర్స్ నటీమణులని పెళ్లి చేసుకున్నారు.
ఇక ఇప్పుడు టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఆ మధ్య సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో ప్రేమాయణం నడుపుతున్నాడని వార్తలు వచ్చాయి. అనంతరం నటి సారా అలీఖాన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్లు వినిపించాయి.
అయితే తాజాగా ఓ మీడియా ఇంటరాక్షన్‌లో పాల్గొన్న శుభ్ మన్ గిల్‌ను మీ క్రష్ ఎవరూ అన్న ప్రశ్చించగా, దానిని స్కిప్ చేసేందుకు ప్రయత్నించాడు. కాని మళ్లీ అదే ప్రశ్నవేయడంతో తనకు రష్మికపై క్రష్ ఉందని చెప్పుకొచ్చాడు.
దీంతో కొందరు నెటిజన్స్ విజయ్ దేవరకొండకు అన్యాయం చేస్తావా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి శుభ్‌మన్ గిల్ కామెంట్ పై మన పుష్ప భామ రష్మిక ఎలా స్పందిస్తుందా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
also read :
Health Tips | ఆరోగ్య చిట్కాలు | ఈ 10 చిట్కాలు మీ ఆరోగ్యానికి..
Medaram jathara : సమ్మక్క సారక్కలు ఎవరు ? మేడారం జాతర విశేషాలు తెలుసుకోండి
Eiffel Tower : ఈఫిల్ టవర్ చరిత్ర , విశేషాలు తెలుసుకోండి
prostate cancer : ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి? లక్షణాలు, చికిత్స ఇలా..