Telugu Flash News

Rashmika: విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన ర‌ష్మిక‌

vijay devarakonda and rashmika dating news

Rashmika: రష్మిక మందన్నా-విజయ్ దేవరకొండ జంట గురించి గత కొంత కాలంగా సోషల్ మీడియాలో తెగ ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి. ఆ మ‌ధ్య మాల్దీవుల్లో ఈ జంట కలిసి వెకేషన్ ను ఎంజాయ్ చేసింది అని ప్ర‌చారం జ‌రిగింది, ఇక రష్మిక లైవ్ వీడియోలో విజయ్ వాయిస్ వినిపించినట్లు ఓ వీడియో కూడా సోషల్ మీడియాను ఎంతో షేక్ చేసింది.

Rashmika: విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి బ్రేక‌ప్ చెప్పిన ర‌ష్మిక‌.. కొత్త హీరోతో రిలేష‌న్‌లో నేష‌న‌ల్ క్రష్ ..!

వీటిపై పెద్ద‌గా స్పందించిని ర‌ష్మిక తాజాగా ఓ ట్వీట్‌కి ఆస‌క్తిక‌ర రిప్లై ఇచ్చింది. ట్వీట్‌లో విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నాలు డేటింగ్ లో ఉన్నారు అనడానికి స్ట్రాంగ్ రీజన్ విజయ్ చేతికి ఉండాల్సిన ఉంగరం రష్మిక చేతికి ఉండటమే అని అన్నాడు. అంతేకాదు వారు ఇద్దరు కలిసి ప్ర‌స్తుతం ఒకే ఇంట్లో ఉంటున్నారు.

Rashmika: ఆ ప‌ని నేను ప‌దే ప‌దే చేస్తే బ్యాక్ పెయిన్ రావ‌డం ఖాయం.. ర‌ష్మిక స్ట‌న్నింగ్ కామెంట్స్

త్వరలోనే వీరు మనకి ఓ గుడ్ న్యూస్ కూడా చెప్ప‌బోతున్నారు అంటూ మీడియా సంస్థ త‌న ట్వీట్‌లో రాసుకు రాగా, దానిపై స్పందించిన ర‌ష్మిక‌… “అయ్యో మీరు మ‌రీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు బాబు.. డోంట్ ఓవర్ థింక్” అంటూ డేటింగ్ వార్తలపై త‌న‌దైన శైలిలో క్లారిటీ ఇచ్చింది. ఇక రష్మిక ప్రస్తుతం పుష్ప 2 తో పాటుగా మరికొన్ని చిత్రాల్లో నటిస్తూ.. ఫుల్ బిజీగా ఉన్న విష‌యం విదిత‌మే.

Exit mobile version