Rashmika: ఎప్పుడు సైలెంట్‌గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోయే రష్మిక ఆగ్రహం వ్యక్తం చేసింది. తన కామెంట్లో అసహనంతో పాటు హెచ్చరిక కూడా పంపింది. ఇన్నాళ్లు భరించాను ఇకపై సహించేది లేదని రష్మిక తన ఇంస్టాగ్రామ్ వేదికగా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కెరీర్ బిగినింగ్ నుండి నేను సోషల్ మీడియా వ్యతిరేకత, ట్రోల్స్ ఎదుర్కొన్నా. ఇక ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చింది. ప్రతి ఒక్కరూ నన్ను ఇష్టపడాలనే నియమం లేదు. అదే సమయంలో మితిమీరి ప్రవర్తిస్తే సహించలేము అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇచ్చి పడేసింది..
ఇటీవల ఇంటర్వ్యూలో నేను మాట్లాడిన మాటలని వక్రీకరించారు. నేను అనని మాటలు రాశారు. ఈ పుకార్లు నాతో పాటు నా వాళ్ళను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. వాటిని పరిగణలోకి తీసుకొని నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. మంచి ఔట్ ఫుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కానీ అర్థం లేని నిరాధారమైన ఆరోపణలు, విమర్శలను సహించను. మంచిగా నటించి, పాత్రలు చేసి మిమ్మల్ని సంతోషపరచాలనేదే నా ఉద్దేశ్యం. మనం అంతా చాలా కష్టపడుతున్నాము…. అంటూ అనేక విషయాలు చర్చిస్తూ రష్మిక మందాన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
రష్మిక మందన మీద గత కొన్ని రోజులుగా వస్తోన్న రూమర్లు హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. రష్మిక విజయ్ దేవరకొండ మాల్దీవుల ట్రిప్ మీద ఎంత రచ్చ జరిగిందో మన అందరికీ తెలిసిందే. ఇలా తన మీద వచ్చిన రూమర్లు, నెగెటివిటీ, ట్రోలింగ్ మీద తాజాగా రష్మిక స్పందించాల్సి వచ్చింది. మరోవైపు రష్మిక తెలుగులో పుష్ప 2 చేస్తున్నారు. హీరో విజయ్ కి జంటగా నటించిన వారసుడు 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అలానే పలు బాలీవుడ్ చిత్రాలు చేస్తుండగా, కొన్ని సినిమాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. అమితాబ్‌తో నటించిన బాలీవుడ్ చిత్రం దారుణంగా నిరాశపరచింది.