HomecinemaRashmika Comments on Baby Movie : బేబీ సినిమా పై రష్మిక షాకింగ్ కామెంట్స్ !

Rashmika Comments on Baby Movie : బేబీ సినిమా పై రష్మిక షాకింగ్ కామెంట్స్ !

Telugu Flash News

Rashmika Comments on Baby Movie : తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన్న. ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. తాజాగా ఈ భామ ఆనంద్ దేవరకొండ బేబీ సినిమా గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటీనటులు గా తెరకెక్కిన చిత్రం బేబీ. బేబీ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

జూలై 14 న విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ విడుదలైన మార్నింగ్ షో నుండే మంచి మౌత్ టాక్ తెచ్చుకుంది. ఆనంద్ దేవరకొండ ఇప్పటి వరకు నటించిన సినిమాలు సరైన విజయం సాధించలేదు. ఆనంద్ దేవరకొండ కెరీర్‌కి బేబీ సినిమా మంచి బ్రేక్‌నిచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మూవీ పై చాలా మంది ప్రముఖులు, సెలెబ్రిటీలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఈ క్రమంలో నటి రష్మిక మందన్న కూడా ఈ సినిమాపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.. బేబీ సినిమా చూశాను, ఈ సినిమాలోని అద్భుతమైన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను.. ప్రతి సన్నివేశం మనసుకు హత్తుకుంది. ఈ సందర్భంగా బేబీ చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ సినిమాపై ప్రశంసలు కురిపించింది. బేబీపై రష్మిక చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

బేబీ సినిమా చూసేందుకు రష్మిక రహస్యంగా థియేటర్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులు తనను గుర్తించకుండా ఉండేందుకు ఈ లేడీ సీక్రెట్‌గా క్యాప్, మాస్క్ ధరించి సినిమా చూసేందుకు థియేటర్‌కి వెళ్లింది. రష్మిక నటించిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది.. అనిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించింది. అర్జున్ రెడ్డి దర్శకత్వం చేసిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకి కూడా డైరక్షన్ చేస్తున్నాడు.

also read :

Priya Prakash Varrier : ఈ యంగ్ బ్యూటీ కి పాకిస్థాన్‌లో కూడా అభిమానులు ఉన్నారా?

-Advertisement-

Kajol-Sharukh Khan : కాజోల్ కామెంట్స్ పై షారూఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఫైర్ !

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News