Telugu Flash News

ఖరీదైన విల్లా గిఫ్ట్ పై క్లారిటీ ఇచ్చిన రష్మి గౌతమ్

rashmi gautam clarity on buying villa

Rashmi gautam : సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీల‌కి సంబంధించి నిత్యం ఎన్నో ర‌కాల వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. ప్రేమ‌, పెళ్లి, ఆస్తులు, గిఫ్ట్‌లు, డేటింగ్ ఇలా ప‌లు ర‌కాల వార్త‌లు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంటాయి. ఇందులో కొన్నింటికి వారు క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ, మ‌రి కొన్నింటిని ప‌ట్టించుకోవ‌డ‌మే మానేస్తారు.

అయితే ఇటీవ‌ల ప‌లు షోస్‌లో సెల‌బ్రిటీల పుకార్ల‌కి సంబంధించి ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతుండ‌గా, ఆ స‌మ‌యంలో వాటిపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇటీవ‌ల యూట్యూబర్స్ దారుణమైన థంబ్ నెయిల్స్ తో వ్యూస్ కోసం సదరు ప్రముఖుల మనోభావాలు దెబ్బతీస్తున్న నేప‌థ్యంలో శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా దీనిపై చర్చ నడిచింది.

షో యాంకర్ రష్మీ, జడ్జి ఇంద్రజ, కమెడియన్స్ హైపర్ ఆది, నరేష్ లపై ప్రచారం అవుతున్న పుకార్లు, వాటికి సంబంధించిన థంబ్ నెయిల్స్ షోలో ప్ర‌ద‌ర్శించ‌గా, దానిపై వారు క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. పెద్ద మొత్తంలో దానధర్మాలు చేస్తున్న ఇంద్రజపై ఐటీ దాడులు దాడులు జరిగాయని క్రియేట్ న్యూస్‌పై ఆమెపై స్పందిస్తూ.. దానధర్మాలు చేశానని మీరే అంటున్నారు.

అలాంటప్పుడు నా దగ్గర ఇంకేం ఉంటుంది మ‌రి. మనలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉందని తెలిస్తే, ఆ విష‌యం నా వరకూ వస్తే సహాయం చేయడానికి ముందుంటాను. అంతే కానీ నా మీద ఎలాంటి ఐటీ దాడులు జరగలేదని ఇంద్రజ క్లారిటీ ఇచ్చారు.

ఇక రష్మీ పై ఒక యూట్యూబర్ ‘రష్మీకి ఖరీదైన విల్లా గిఫ్ట్ గా ఇచ్చిన ప్రముఖ హీరో” అని థంబ్ నెయిల్ పెట్టి వీడియో చేశాడు. ఈ రూమర్ కి శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా రష్మీ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. ఒక ఆడపిల్లపై నిరాధార కథనాలు ఎలా రాస్తారంటూ అస‌హనం వ్య‌క్తం చేసింది.. నాకు విల్లా ఇచ్చిన హీరో ఎవరో ఇప్పుడు చెబుతా.. ఆ హీరో ఎవరో కాదు నేనే.

విల్లాలు, కార్లు, ఇల్లు, ప్లాట్స్… ప్రతిదీ నా సొంత డబ్బులతో నేను కొన్నుకున్నాను. ద‌య‌చేసి ఇలాంటి థంబ్ నెయిల్స్ నమ్మకండి. డే అండ్ నైట్ కష్ట‌పడి, షూటింగ్స్ చేసి సంపాదించుకున్న డబ్బులతో మేము కొనుక్కుంటున్నామని క్లారిటీ ఇచ్చింది ర‌ష్మి.

సుడిగాలి సుధీర్ తో ఎఫైర్ నడుపుతున్నారన్న వార్తల మీద రష్మీ స్పందిస్తూ… సుధీర్ నాకు మధ్య ఎలాంటి బంధం ఉందనేది మా వ్యక్తిగతం. జీవితానికి సంబంధించిన ప్రతి విషయం చెప్పేస్తే ఇంకేమీ ఉంటుంది. ఫ్యూచ‌ర్‌లో మా మ‌ధ్య ఏముంద‌నేది తెలుస్తుంద‌ని చెప్పుకొచ్చింది.

also read news:

శరీరంలో యూరిక్ యాసిడ్‌ను నియంత్రించే 5 పవర్ ఫుల్ ఫుడ్స్ !!

మునక్కాయ మటన్.. తిన్నారంటే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే..!

 

Exit mobile version