Rashmi Gautam :జబర్దస్త్ యాంకర్ రష్మి బుల్లితెరపై తన సత్తా చాటుతూ దూసుకుపోతుంది. పలు షోలతో పాటు `శ్రీదేవీ డ్రామా కంపెనీ`కి కూడా యాంకర్‌గా చేస్తుంది. అయితే రీసెంట్ ఎపిసోడ్‌లో తన లవ్ సీక్రెట్ బయటపెట్టి షాకిచ్చింది రష్మీ. వ్యక్తిగత జీవితంలో తాను ప్రేమలో ఉన్నట్టు చెప్పుకొచ్చింది.
అయితే అది ఎలా అంటే.. పర్సనల్ లైఫ్ లో తన లవ్ సక్సెస్ అవుతుందా? లేదా? అనేది చిన్న టెస్ట్ చేసుకుంది. అందులో భాగంగా ఓ పాప్ కార్న్ బాక్స్ లో రాళ్లు వేయాల్సి ఉంటుంది. కరెక్ట్ గా అది బాక్స్ లో పడితే, అనుకున్నది సక్సెస్ అవుతుంది, లేదంటే ఫెయిల్ అయినట్టు అని భావించి రష్మి తన ప్రేమనే టెస్ట్ చేసుకుంది.
చాలా టెన్షన్ పడుతూనే రష్మీ రాయి వేయగా లక్కీగా అది ఆ డబ్బాలో పడింది. దీంతో ఒక్కసారిగా రష్మి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన లవ్ సక్సెస్ అవుతుందనే ఆనందంలో అదిరిపోయే మాస్ స్టెప్పులేసి రచ్చ చేసింది.
`రష్మీ నీ లవ్ సక్సెస్` అని చెప్పడంతో నా పొలంలో మొలకలొచ్చాయ్ అంటూ తెగ రెచ్చిపోయి చిందులేసింది.. అయితే సక్సెస్ అవుతుందని ఆనందం చెందింది కాని ఆ ప్రియుడు ఎవరు అనే విషయం మళ్లీ సస్పెన్స్ లోనే పెట్టింది. ఏది ఏమైన ఈ ఎపిసోడ్ ఇప్పుడు యూట్యూబ్‌లో తెగ ట్రెండింగ్ అవుతుంది.
also read :
Gold Rates Today (02-05-2023) : నేడు బంగారం, వెండి ధరలు ఇలా..
Weather Today (02-05-2023) : ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఇలా..