HomecinemaChaitanya: కొరియోగ్రాఫ‌ర్ చైత‌న్య మృతితో ఎమోష‌న‌ల్ అయిన శ్ర‌ద్ధా, ర‌ష్మీ గౌతమ్

Chaitanya: కొరియోగ్రాఫ‌ర్ చైత‌న్య మృతితో ఎమోష‌న‌ల్ అయిన శ్ర‌ద్ధా, ర‌ష్మీ గౌతమ్

Telugu Flash News

Chaitanya: మంచి భ‌విష్య‌త్ ఉన్న ఢీ కొరియోగ్రాఫ‌ర్ చైత‌న్య సూసైడ్ చేసుకోవ‌డం ప్ర‌తి ఒక్క‌రిని క‌లిచి వేస్తుంది. . నెల్లూరులోని ఓ హోటల్ లో ఆయన బలవన్మరణానికి పాల్ప‌డ్డాడు. చనిపోవ‌డానికి ముందు ఓ సెల్ఫీ వీడియో చేసిన ఆయ‌న ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు వీడియోలో చెప్పుకొచ్చారు.

అయితే చైతన్య మరణవార్త బుల్లితెర వర్గాలను ఎంతో క‌లిచి వేస్తుంది.. చైతన్యతో అనుబంధం గుర్తు చేసుకుంటూ ప‌లువురు ఎమోష‌న‌ల్ పోస్ట్‌లు పెడుతున్నారు. ర‌ష్మీ స్పందిస్తూ.. నీ సమస్యకు ఇది పరిష్కారం కాదు చైతన్య. ఫ్యామిలీకి సన్నిహితులకు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నా అంటూ కామెంట్ పెట్టింది.

ఇక శ్రద్దాదాస్ తీవ్ర భావోద్వేగానికి గుర‌వుతూ.. పుట్టుక, మరణం మనిషికి అర్థంకాని అంశాలు. కానీ ఈ మధ్యలో మనం ఎలా జీవించాం అనే విషయమే అతడి గొప్పతనాన్ని నిర్ణయిస్తుందని శ్ర‌ద్ధా పేర్కొంది. చైతన్య మాస్టర్ ఎంతో గొప్ప హృదయంతో, విలువలతో జీవించారని అనుకుంటున్నాను.

మీరు కోరుకున్న విధంగా చివ‌రి గ‌మ్య‌స్థానాన్ని చేరారు అని భావిస్తున్నా. మీ చిరునవ్వు ఇతరులని కూడా నవ్వించేది. కానీ ఈరోజు నేను వెక్కి వెక్కి ఏడ్చా. నీ చిరునవ్వుని ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటా అంటూ శ్రద్దా దాస్ ఎమోషనల్ అయింది. శేఖర్ మాస్టర్ కూడా చైతన్య మృతికి సంతాపం తెలియ‌జేశారు.

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News