రావణుడితో పోరాడే శక్తి తనకు లేదని తెలిసినా.. ఆ రాక్షసుడితో పోరాడితే ఖచ్చితంగా తన ప్రాణం పోతుందని అర్థం అయినా.. సీతమ్మను కాపాడడం కోసం పోరాడి ప్రాణాలు విడిచి,చరిత్రలో నిలిచిపోయింది “జటాయువు”.
ఆ జటాయువే ఇప్పుడు అయోధ్యలోని రామ మందిరిర నిర్మాణం పూర్తవుతున్న వేళ.. తన ప్రభువును చూసుకోవడానికి వచ్చిందని, ప్రజల మధ్యనే తిరుగుతూ రామ మందిరాన్ని వీక్షిస్తుందని ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ స్థానికుల మధ్య చర్చ జరుగుతుంది.
కాన్పూర్‌లోని బెనాజ్ హబర్ ప్రాంతంలోని ఈద్గా సమీపంలో పెద్ద పెద్ద రెక్కలతో అరుదైన “జటాయువు” లాంటి పక్షి ఒకటి అక్కడ స్థానికులకు కనిపించింది.అది కనిపించిన మొదట్లో ఆ పెద్ద ఆకారాన్ని చూసి స్థానికులు ఎవరూ దాని దగ్గర వెళ్ళలేదు.కానీ ఆ తరువాత అసలు ఆ పక్షి ఏంటో చూద్దామని ప్రజలు దాని వెంటపడి పట్టుకోడానికి ప్రయత్నించగా.. ప్రతి సారి దొరికినట్టు దొరికి తప్పించుకుపోయేది.అయితే ఈ ఆదివారం జనవరి 8న ఆ పక్షి ఎగరలేక ఇబ్బంది బడుతూ తిరగడం చూసిన స్థానికులు ఆదును చూసి పట్టుకున్నారు. తరువాత దాన్ని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
ఈ పక్షిని స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు ఇది హిమాలయ ప్రాంతాలలో నివసించే ఒక అరుదైన పక్షి జాతికి చెందిన గద్ద అని తెలిపారు.వృద్ధాప్యం కారణంగా ఎగరలేక ఇబ్బందులు పడుతూ ఇలా ప్రజల మధ్య తిరుగుతుందని వెల్లడించారు.
ఈ అరుదైన రాబందు 5 అడుగుల ఎత్తు ఉంది.రెక్కలు 6 అడుగుల పొడవు ఉన్నాయి. బరువు ఎనిమిది కేజీలకు పైగా ఉంది.ఇక దీని వయసు చాలా ఎక్కువ ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడుతుండగా.. ఈ రకమైన రాబందులు హిమాలయాలతో పాటు టిబెట్ పీఠభూమి ప్రాంతంలోనూ కనిపిస్తాయని తెలిపారు.
ఆపై దీన్ని స్థానిక జూ పార్క్‌కు తరలించి అక్కడ 15 రోజుల పాటు దాన్ని క్వారంటైన్‌లో ఉంచి పరిశీలించనున్నట్లు తెలిపారు.మిగతా పక్షులతో కలవకుండా దాన్ని ప్రత్యేకంగా ఉంచినట్లు అధికారులు వివరించారు.అయితే స్థానికుల సమాచారం ప్రకారం ఆ ప్రాంతంలో ఇలాంటి ఇంకో పక్షి తిరుగుతుందని తెలుసుకున్న అధికారులు దాన్ని కూడా స్వాధీనం చేసుకుని సురక్షితమైన ప్రదేశానికి తరలించడానికి దాని కోసం వెతుకుతున్నారు.
ఇదిలా ఉండగా ఈ వింత అరుదైన పక్షిని చూసిన అక్కడ స్థానికులు ఇది రావణుడితో పోరాడిన జటాయువని, అందుకే ముగింపు దశలో ఉన్న రామ మందిరాన్ని వీక్షించడానికి వచ్చిందని ప్రజలు చర్చిస్తున్నారు.దీనికి తోడు ఈ గద్దను విడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడంతో ఈ విడియోని చూస్తున్న వీక్షకులు రకరకాల ప్రశ్నలను లేవనెత్తుతూ వీడియోని వైరల్ చేస్తున్నారు.
Jatayu Bhagwaan ke vanshaj Uttarpradesh me Ram Mandir darshan hetu padhare pic.twitter.com/Cz83VDisVA
— Niraj Kumar (@nirajkolkata) January 9, 2023
also read:
Pakistan economic crisis : పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం.. గోధుమ పిండి కోసం జనం తిప్పలు !
RRR Movie – Naatu Naatu – Golden Globes 2023 : గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్