Rangabali telugu movie review
రంగబలి కథ ఏంటంటే ?
రాయవరం అనే పట్టణంలో.. శౌర్య (నాగశౌర్య) చిన్నప్పటి నుంచి ప్రత్యేకంగా కనిపించాలని తపన పడే కుర్రాడు. అందుకే అతన్ని అందరూ షో గాడూ అని పిలుచుకుంటారు. టైటిల్ గా భావించి స్నేహితులతో కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అతనికి తన ఊరు అంటే పిచ్చి. బతికినా, చచ్చినా అక్కడే స్థిరపడిపోతాడు. బి ఫార్మసీ చదివినా పెద్దగా జ్ఞానం ఉండదు. శౌర్య తండ్రి రంగబలి సెంటర్ పక్కనే ఉన్న ఆ గ్రామంలో మెడికల్ షాపు నడుపుతున్నాడు. అతను శౌర్యను వైజాగ్ పంపి, మెడిసిన్‌లో చేరమని చెప్పాడు. అక్కడ కాలేజీలో సహజ (యుక్తి తరేజ) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు మరియు ఆమె నుండి మెడికల్ షాప్ నాలెడ్జ్ నేర్చుకుంటాడు. వారి ప్రేమ గురించి సహజ తండ్రికి తెలుస్తుంది అతను అంగీకరిస్తాడు. కానీ అతను ఆ ఊరు విడిచి వెళ్లాలని చెప్తాడు . దానికి కారణం ఆ ఊరిలోని రంగబలి అనే సెంటర్ . సెంటర్ పేరు మారుస్తా అంటాడు శౌర్య. మరి ఆ సెంటర్ ప్రత్యేకత ఏంటి..? సెంటర్ కి రంగబలి అనే పేరు ఎలా వచ్చింది? దీనికి సహజ తండ్రికి సంబంధం ఏమిటి? ఆ పేరు మార్చడానికి శౌర్య ఏం చేసాడు అనేది మిగతా కథ.
రంగబలి సినిమా ఎలా ఉందంటే :
ట్రైలర్‌లో కనిపిస్తున్నట్లుగా, రంగబలి మొదటి సగం కామెడీ గా సాగుతుంది. ప్రతి సన్నివేశంతో నవ్వించే ప్రయత్నంలో సినిమా విజయం సాధించింది. శౌర్య స్నేహితులు సత్య, రాజ్‌కుమార్‌లు కామెడీతో నవ్వించేశారు. అలాగే అతని తండ్రి పాత్రలో నటించిన గోపరాజు రమణ ఫస్ట్ హాఫ్ లోనే బాగా చేశాడు. శౌర్య ఇప్పుడున్న ఊరు నుండి వైజాగ్‌కి మారిన తర్వాత కథ ఎలా మారిపోతుంది అనేది చూడాల్సిందే . సత్య కాలేజీలో చేసిన కామెడీ సినిమా కి హైలెట్. అడల్ట్ డైలాగులు కొన్ని ఉన్నా, అవి సహజంగా ఉంటాయి మరియు వల్గర్ గా అనిపించవు. ప్రేమకథలో, హీరోయిన్ తండ్రి నుండి అభ్యంతరం రావడంతో, గ్రామానికి తిరిగి వచ్చిన శౌర్య, తన స్నేహితుడి మాటలు నమ్మి రంగబలి సెంటర్‌లో బాంబు వేస్తాడు. అది కాస్త బూమరాంగ్ అవుతుంది. కానీ ఎమ్మెల్యే దాన్ని పెద్ద ఇష్యూ చేయకుండా ఆపేస్తాడు.
రంగబలి ఎవరో , సెంటర్ పేరు మార్చే ప్రయత్నంలో రంగబలి గురించి ఆరా తీస్తాడు. సెంటర్ పేరు మారిస్తేనే అతని ప్రేమ సక్సెస్ అవుతుంది కాబట్టి.. ఆ ప్రయత్నంలో రంగా గురించి తెలుసుకోవడం. ఆ తర్వాత కొన్ని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కారణంగా సెంటర్ పేరు మారుస్తారు. సెకండాఫ్ అంతా లాజిక్ కి అందకుండా ఏదో అలా సాగిపోతుంది.
నటీ నటులు ఎలా చేశారంటే ?
ఇక శౌర్య అలియాస్ షో పాత్రలో శౌర్య బాగా నటించాడు. ఈ పాత్ర కోసం నిజాయితీగా కష్టపడ్డాడు. కానీ సెకండాఫ్ మాత్రం తన ప్రయత్నాలు ఫలించలేదని అనిపించింది. చాలా రోజుల తర్వాత హీరోయిన్ కి మంచి క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది. సెకండాఫ్‌లో పాటతో పాత్ర ఔన్నత్యాన్ని తగ్గించాడు దర్శకుడు. కానీ యుక్తి తేరేజా బాగా నటించింది. చాలా సన్నివేశాల్లో డైలాగ్‌ల కంటే ఎక్స్‌ప్రెషన్స్ ఎక్కువ. కానీ బాగా చేసింది. ఓవరాల్‌గా సత్య కామెడీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. మురళీశర్మ ఓకే. శరత్ కుమార్ గురించి ఏం చెప్పలేము. శుభలేఖ సుధాకర్ రొటీన్ పాత్ర. గోపరాజు రమణ ఫస్ట్ హాఫ్‌లో నవ్వించగా, సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్‌తో మెప్పించాడు. మిగతా పాత్రలన్నీ ఓకే.
టెక్నికల్ గా ఎలా ఉందంటే ?
సంగీతం అంత గొప్పగా లేదు. ఒక్క పాట కూడా రిజిస్టర్ కాలేదు. నేపథ్య సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ ఆహ్లాదకరంగా ఉంది. ఎడిటింగ్ ఓకే. డైలాగ్స్ బాగున్నాయి. సెట్స్, ఆర్ట్ వర్క్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడిగా ఫస్ట్ హాఫ్ లో కమాండ్ చేసినా.. సెకండాఫ్ లో ఒక్కసారిగా కింద పడిపోయాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌ని సడెన్‌గా ముగించారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి క్లైమాక్స్ చూడలేదంటే అతిశయోక్తి కాదు. ఈ దర్శకుడు దర్శకుడిగా కంటే మాటల రచయితగానే పేరు తెచ్చుకునే అవకాశాలున్నాయి.
పాజిటివ్ పాయింట్స్ ఏంటి ?
ఫస్ట్ హాఫ్
కామిడీ
శౌర్య, యుక్తి తారేజా
నెగెటివ్ పాయింట్స్ ఏంటి ?
సెకండ్ హాఫ్
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
సంగీతం
క్లైమాక్స్
రంగబలి రేటింగ్ : 2.5/5
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE