HomecinemaRana: నా కుడి క‌న్ను క‌నిపించ‌దు అంటూ ఆశ్చ‌ర్య‌క‌ర కామెంట్స్ చేసిన రానా

Rana: నా కుడి క‌న్ను క‌నిపించ‌దు అంటూ ఆశ్చ‌ర్య‌క‌ర కామెంట్స్ చేసిన రానా

Telugu Flash News

Rana: రానా దగ్గుబాటి.. ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడిగా, సురేష్‌ బాబు కొడుకుగా.. దగ్గుబాటి వారసుడిగా సినీ ఇండ‌స్ట్రీలో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్నాడు. లీడర్‌తో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రానా బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ.. కెరీర్‌లో ముందుకు సాగుతున్నాడు రానా. ఇటీవ‌ల‌ ఆయన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులు ముందుకు వ‌చ్చిన రానా దీంతో మంచి స‌క్సెస్ అందుకున్నాడు.

తాజాగా రానా తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించి అంద‌రిని ఆశ్చ‌ర్యంలో ప‌డేశాడు. ‘‘గతంలో నాకు కుడి కన్ను, కిడ్నీలకు ఆపరేషన్‌ అయ్యింది. నాకు చిన్నప్పటి నుంచి కుడి కన్ను కనిపించదు. అందుకే దానికి ఆపరేషన్‌ చేశారని అన్నాడు. కొన్నాళ్ల క్రితం కిడ్నీలకు సంబంధించిన సమస్యలు రావడంతో చివరికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కూడా చేయాల్సి వచ్చింది రానా తెలియ‌జేశాడు. దాదాపు చాలా మంది శారీరక సమస్యల కారణంగా మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ నేను ధైర్యంగా ఉండి, ఆ సమస్యల నుంచి బయటపడగలిగాను అని తెలియ‌జేశాడు రానా.

also read :

Sreemukhi Latest Hot Photos, Images, Stills, pictures 2023

Tamanna Latest Photos at Lakme Fashion Week 2023

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News